Dosthana 2 : “దోస్తానా 2” నుంచి హీరో అవుట్..!

Dosthana 2 : బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యాక చిత్ర యూనిట్ మధ్య ఎలాంటి క్రియేటివ్ డిఫ్రెన్స్ రాకపోతే థియేటర్స్‌లో బొమ్మ పడే వరకు వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. షూటింగ్ సమయంలో తరచూ దర్శక, నిర్మాతలతో కలిసి.. హీరో, హీరోయిన్ సహా ఇతర టెక్నీషియన్స్ అందరూ ఎంతో జాయ్‌ఫుల్‌గా గడుపుతారు. ఆ తర్వాత ప్రమోషన్స్ సమయంలో కూడా సినిమా మీద బజ్ క్రియేట్ చేందుకు పడే పాట్లన్నీ తెలిసినవే. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో దర్శక – నిర్మాత – నిర్మాత – హీరో సహా మిగతా టెక్నీషియన్స్‌తో క్రియేటివ్ డిఫ్రెన్స్ వచ్చి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న.. తప్పించిన సందర్భాలు చాలానే జరగడం చూస్తూనే ఉన్నాము. ఇటీవల ఒక పెద్ద బ్యానర్‌లో బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ కూడా ఇలా క్రియేటివ్ డిఫ్రెన్స్ వల్లే అర్ధాంతరంగా బయటికి వచ్చాడు.

hero out from dosthana-2...!
hero out from dosthana-2…!

కాగా ఇలాంటి వ్యవహారమే బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో జరిగిందని బీ టౌన్‌లో వినిపిస్తోంది. హిందీలో తెరకెక్కుతున క్రేజీ సీక్వెల్ దోస్తానా 2 సినిమా విషయంలో హీరో- నిర్మాత మధ్య మనస్పర్ధలు వచ్చి హీరోని ప్రాజెక్ట్ నుంచి తొలగించారట. ఆ హీరో కార్తీక్ ఆర్యన్ కాగా.. నిర్మాత కరణ్ జోహార్. కార్తీక్ ఆర్యన్‌కి చెందిన టాలెంట్ ఏజెన్సీ సీక్వెల్ సినిమాకి కాల్షీట్లు ఇవ్వడం లేదట. అందుకే మేకర్స్ కార్తీక్ ఆర్యన్ స్థానంలో మరొక హీరోని తీసుకోబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Dosthana 2 : ధర్మ ప్రొడక్షన్స్‌లో ఇలాంటి వ్యవహారాలు జరగడం ఇదే మొదటి సారి.

అయితే 2019లోనే కార్తీక్ ఆర్యన్ దోస్తానా 2 టీమ్ లో చేరాడు. కాగా గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇటీవల మళ్ళీ సెట్ మీదకి వచ్చింది. కార్తీక్ కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. కానీ తాజాగా కార్తీక్ కి ఇక ఈ ప్రాజెక్ట్ తో ఏ సంబంధం లేదంటూ నిర్మాత చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ధర్మ ప్రొడక్షన్స్‌లో ఇలాంటి వ్యవహారాలు జరగడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు ఆయన ప్రాజెక్ట్ నుంచి ఇలా అర్ధాంతరంగా ఎవరినీ తొలగించింది లేదు.

Advertisement