Nani: బ‌య‌టెక్క‌డో ఉన్నా, అత‌ను ఉండ‌కూడ‌దు.. నాని ట్వీట్

Nani: సైదాబాద్ హ‌త్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడిని అరెస్ట్ చేయాల‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.సామాన్యులు, సెల‌బ్రిటీలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. రీసెంట్‌గా మంచు మ‌నోజ్ బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైదాబాద్ ఘటనకు కారణమైన నిందితుడిని 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నాడు.

Hero Nani Tweet on Saidabad Case Accused
Hero Nani Tweet on Saidabad Case Accused

మ‌హేష్ బాబు కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం’ అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.

ఇక తాజాగా నాని ..తెలంగాణ పోలీసులు చేసిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ ..బ‌య‌టెక్క‌డో ఉన్నాడు, అత‌ను ఉండ‌కూడదు అంటూ నాని చాలా ఎమోష‌న‌ల్‌గా కామెంట్ చేశాడు. నిందితుడిని ప‌ట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. వాడి ఆచూకీ దొర‌క‌క పొవ‌డంతో నిందితుడు రాజు ఆనవాళ్లను విడుదల చేశారు సీపీ అంజనీకుమార్‌.

Hero Nani Tweet on Saidabad Case Accused
Hero Nani Tweet on Saidabad Case Accused

రాజు రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉందని.. వయస్సు సుమారు 30 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు. నిందితుడిని ప‌ట్టిస్తే ప‌ది ల‌క్ష‌ల రివార్డ్ ఇస్తామ‌ని కూడా తెలియ‌జేశారు.