Naga Shaurya : యంగ్ హీరో పెళ్లి.. మొదలైన సందడి
NQ Staff - November 20, 2022 / 10:36 AM IST

Naga Shaurya : టాలీవుడ్ మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కాడు.
పెళ్లి కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా నాగశౌర్య ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అనూష శెట్టి గురించి మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కర్ణాటక కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి గురించి మీడియా లో ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యం లో ఎలా ఉంటుంది వీరి పెళ్లి ఎప్పుడు అంటూ అందరూ కూడా ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు వీరి పెళ్లి హడావుడి మొదలైంది. రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు ఈ వివాహ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నాగశౌర్యకి ఎంతో మంది మిత్రులు ఆప్తులు ఉన్నారు.
కనుక నాగ శౌర్య మరియు అనూష శెట్టిని ఆశీర్వదించేందుకు ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలెంట్ తో పాటు కష్టపడే తత్వం ఉన్న నాగశౌర్య హీరోగా ముందు ముందు మంచి సినిమాలు చేశాడని నమ్మకమును ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
సొంత బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్న నాగశౌర్య పెళ్లి తర్వాత కమర్షియల్ గా మరిన్ని సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.