SAMANTHA : శ్రీమ‌తి అడుగుజాడ‌ల‌లో అక్కినేని హీరో.. గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో మ‌రి!

SAMANTHA : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్ ఉన్నారు హీరో అక్కినేని నాగచైతన్య. ఇప్పటికే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న లవ్ స్టోరీతో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు అన్నీ సక్సెస్ ను సాధిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కె. డైరెక్షన్ లో థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న మరో సినిమాలో కూడా నాగచైతన్య యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నాగచైతన్య, తన భార్య సమంత అడుగుజాడల్లో నడుస్తున్నట్లు చెబుతున్నాయి సినీ వర్గాలు. ఈ క్రమంలోనే నాగచైతన్య త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ కు అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది.

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య డిజిటల్ ఫీల్ట్ ఎంట్రీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఓటీటీలో నటించడానికి ఎంతో ప్రాధాన్యత ఉందని.. సెన్సార్ లాంటి ప్రాబ్లెమ్స్ కూడా ఉండవంటూ తెలిపారు. ఓటీటీలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లో ఎంతో క్రియేటివీతో పాటు ఆర్టిస్టుల టాలెంట్ దాగి ఉందని.. అందుకే డిజిటల్ ప్లాట్ ఫామ్ ని ప్రతిఒక్కరూ ఎంకరేజ్ చేయాలని అన్నారు.

దీంతో నాగచైతన్య త్వరలోనే ఓ డిజిటల్ సినిమా గానీ.. ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పిట్టకథలు సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పాటు.. నాగ చైతన్య ఈ అల్టిమేట్ విషయాన్ని చర్చించడం అక్కినేని ఫ్యాన్స్ కి సెలెబ్రేటింగ్ గా ఉంది. ఇంకేముంది నాగచైతన్య, తన భార్య బాటలో నడుస్తున్నారంటూ నెట్టింట్లో పోస్టులు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం సమంతా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఫ్యామిలీ మెన్ 2 లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో పాటు సమంతా పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement