Hero Movie Review: సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అశోక్ కి జంటగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మకర సంక్రాంతి సందర్భంగా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగి అంచనాలని మరింతగా పెంచేశాడు. మరి ఈ సినిమా కథ ఎలా ఏంది, టాక్ గురించి తెలుసుకుందాం.
కథ : అర్జున్ (అశోక్ గల్లా) సినిమా హీరో కావాలనుకునే మధ్యతరగతి యువకుడు. సుబ్బు (నిధి) మరియు ఆమె తండ్రి జగపతి బాబు అతని పక్కింటివారు. అర్జున్ పొరపాటున కొరియర్ ద్వారా తుపాకీ అందుకుంటాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంలో ముంబై మాఫియాతో పలు అడ్డంకులు ఏర్పడతాయి. మిగిలిన చిత్రం అర్జున్ మరియు ముంబై మాఫియా మధ్య జరిగే ఆసక్తికర గేమ్‌గా ఉంటుంది. జగపతి బాబు బ్యాక్‌స్టోరీ ట్విస్ట్‌గా ఉంటుంది. మరి ఇంతకు అర్జున్‌కి కొరియర్ ఎక్కడ నుండి వచ్చింది, ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్‌ఫార్మెన్స్ :
అర్జున్ పాత్రలో అశోక్ గల్లా అదరగొట్టాడు. అశోక్ గల్లాలో చాలా టాలెంట్ ఉంది . పర్ఫార్మెన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు, కామెడీ ట్రాక్ పెద్దగా పండలేదు. హీరోయిన్ నిధి అగర్వాల్‌కి పరిమితమైన పాత్ర ఉంది . వెన్నెల కిషోర్ పాత్ర పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కమెడియన్ సత్య ఈ సినిమాలో తన లౌడ్ క్యారెక్టరైజేషన్ తో విసిగించాడు. జగపతి బాబు డబుల్ షేడ్ రోల్ పెద్దగా క్లిక్ కాలేదు.
టెక్నీషియన్స్ పర్‌ఫార్మెన్స్:
దర్శకుడు సినిమాని బాగానే తెరకెక్కించినా కూడా కొంత కన్ఫ్యూజింగ్‌గా ఉందని అంటున్నారు. ఒక సింపుల్ పాయింట్‌తో మూవీని తిప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సాంగ్స్ పర్లేదు. కెమెరా పనితనం, ఎడిటింగ్ ఓకే. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా ప్రేక్షకులని మరింత అలరించేదిగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- రెండు సాంగ్స్
- ప్రొడక్షన్ వాల్యూస్
- కామెడీ పార్ట్స్
నెగెటివ్ పాయింట్స్
- లాజిక్ లేని కథనం
- ఆకట్టుకోని సన్నివేశాలు
విశ్లేషణ: మొత్తం యాక్షన్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని తెరకెక్కించారు. రొటీన్ కి భిన్నంగా కథ ఉంటుంది. ఏఆర్ టాగూర్, కళ్యాన్ శంకర్ అందించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ హీరో సినిమా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ హాలీవుడ్ లెవల్ లో ఉంది. అశోక్ గల్లా, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ సరిగ్గా సరిపోయింది. యాక్షన్ సీక్వెన్సెస్ అద్భతంగా వచ్చింది. థియేటర్లోనే ఈ సినిమా చూస్తే మజా వేరేగా ఉంటుంది.
రేటింగ్: 2.75/5