Karthikeya Marriage : కార్తికేయ ఇంట పెళ్లి సంద‌డి.. పెళ్లికొడుకుగా ముస్తాబైన ఆర్ఎక్స్ 100 హీరో

Karthikeya Marriage : ఆర్‌ఎక్స్‌100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో కార్తికేయ. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్‌ హీరో బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రేయసితో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాడు. రేపు(నవంబర్‌21)న ఉద‌యం 9 గంట‌ల 47 నిమిషాల‌కు లోహితను పెళ్లాడనున్నాడు.

Hero karthikeya marriage photo shoot
Hero karthikeya marriage photo shoot

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా..కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ పెళ్లి వేడుకకు ఆయ‌న బంధుమిత్రుల‌తో పాటు టాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల త‌న ప్రేమాయ‌ణం గురించి చెప్పుకొచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు కార్తికేయ‌. ‘నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. 2012లో ప్రపోజ్‌ చేశాను. సంవత్సరం తర్వాత ఒప్పుకుంది. బీటెక్‌ చదువుతున్న రోజుల్లో ఓసారి లోహిత నాకు పంపిన మెసేజ్‌ కారణంగా మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. అప్పుడు ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యే మా ఇంట్లో తెలిసింది అని అన్నాడు.

రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్‌ వేడుకలో లోహితకు ప్రపోజ్‌ చేసి, సర్‌ప్రైజ్‌ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్‌ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్‌ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్‌ చేశాను’అని కార్తికేయ చెప్పుకొచ్చారు.

2018లో ‘ఆర్‌ ఎక్స్‌ 100’ తో పరిచయమైన కార్తికేయ ఎప్పుడూ తన ప్రేమ విషయం గురించి బయటకు వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టులో తన ప్రియురాలితో ఏకంగా ఉంగరాలు మార్చుకుని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ సక్సెస్‌ను ఆస్వాదించే పనిలో ఉన్నాడీ హీరో. అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’ సినిమాతో త్వరలో తమిళ తెరపై కూడా మెరవనున్నాడు.