Akhil Akkineni: 13 ఏళ్ల వ‌య‌స్సులో ల‌వ్‌లో ప‌డ్డ ప‌డ్డ అఖిల్.. ప్రేమ గుట్టు విప్పిన బ్యాచిల‌ర్

Akhil Akkineni: అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేయ‌గా, అవి మూడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రిచాయి. ఎన్నో రోజులుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ . అక్టోబర్ 15 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Hero Akhil Shares His School Days First Love Story
Hero Akhil Shares His School Days First Love Story

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘లెహరాయి’ సాంగ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించారు. ఈ చిత్రంలో అఖిల్‌ హర్షగా, పూజా హెగ్డే విభా అనే పాత్రలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ చేసుకుంటున్న అఖిల్.. ఓ ప్ర‌మోష‌న‌ల్ లో భాగంగా 13 ఏళ్ల వ‌య‌స్సులో ఒక అమ్మాయికి ప్ర‌పోజ్ చేశాను. స్కూల్ డేస్‌లో ప్ర‌పోజ్ చేశాను. త‌ర్వాత ఎప్పుడు కూడా ప్ర‌పోజ‌ల్ చేయ‌లేదు.ఇంత అందంగా ఉన్నారు క‌దా, ఎలాంటి డైట్ ప్లాన్ చేసుకుంటారు అని ప‌లువురు అమ్మాయిలు ప్ర‌శ్నించగా, దానికి స‌మాధానం ఇచ్చాడు.

సాల్ట్ తిన‌ను, చీట్ మిల్క్ తీసుకుంటాను. వీకెండ్ కోసం ప‌క్కా డైట్ ప్లాన్ చేసుకుంటాను. వీకెండ్‌లో చాలా ఎక్కువ తింటాను అని అఖిల్ అన్నాడు.అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేక పోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఉన్నాయి. అటు అఖిల్‌, ఇటు భాస్కర్ కెరీర్‌కు కీల‌కంగా మార‌డంతో సినిమాకు ఎక్కడ‌లేని ప్రాధాన్యత వ‌చ్చింది.