adivi shesh : ఎట్టకేలకు గర్ల్ ఫ్రెండ్ గురించి నోరు విప్పిన యువ హీరో.. టైం చూసుకొని ప‌రిచ‌యం చేస్తానంటూ కామెంట్

adivi shesh : చురకత్తుల్లాంటి చూపులు.. చాకులాంటి మాటలు.. అల్టిమేట్ గా నిలిచిన డైలాగ్ లు, వినూత్నంగా తెరకెక్కించే కథలు.. ఇవన్నీ యంగ్ హీరో అడివి శేష్ ప్రత్యేకతలు. 36 సంవత్సరాల వయసులో అడవి శేష్ పెళ్ళి వార్త ఇప్పుడు స్క్రీన్ పైకి వచ్చింది. ఫస్ట్ టైమ్ తన పర్సనల్ విషయాలతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ గురించి తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. తనకు తన జీవితంలో గర్ల్ ఫ్రెండ్ ఉందని.. సమయం వచ్చినప్పుడు అందరికీ పరిచయం చేస్తానని సిగ్గుపడ్డాడు. అడివి శేష్.. ఈ పేరుకి ఓ మంచి బ్రాండ్ ఉంది.. ఖచ్చితంగా భిన్నమైన కథల్ని ఎంచుకుంటాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొంది.

తన శైలిలో.. ఎంతో జాగ్రత్తగా తన శైలిలో సినీ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. తన జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయకం. సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుటి నుండి ఎన్నో కష్టనష్టాలు తట్టుకుని.. నేడు ఈ స్థాయికి చేరుకున్నానని అంటున్నారు అడివి శేష్. ప్రతిఒక్క అనుభవం జీవితంలో ఎన్నో పాఠాల్ని నేర్పిస్తుంది. అలాగే ప్రస్తుతం అడివి శేష్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

లేటెస్ట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా సీఆర్పీఎఫ్ టీమ్ తో కలిసి అడివి శేష్ ఓ స్పెషల్ చిట్ చాట్ లో మాట్లాడుతూ.. తన సినిమా అప్డేట్స్ గురించి, తన లైఫ్ పార్టనర్ గురించి చెప్పి.. ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు. అడివి శేష్ సూపర్ హిట్ సినిమా గుఢచారి ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ను అతి త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. అది కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గురించి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీంతో పాటు ప్రస్తుతం మేజర్ పాత్రలో నటిస్తున్న మేజర్ సినిమాలో యాక్ట్ చేస్తూ.. బిజీ గా ఉన్నారు. 2022 లో గుఢచారి సినిమా సీక్వెల్ వస్తుందని తెలిపారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్క్ వర్క్ కూడా పూర్తయినట్లు వివరించారు.

Advertisement