Abbas: ప్రేమ దేశం హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా?

Abbas: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాష ఏదైనా విడుదలైన సినిమాల భావం మాత్రం ఒక్కటే. అందులోనూ కొన్ని సినిమాలు అయితే ఎన్ని సంవత్సరాలైనా అలా గుర్తుండి పోతాయి. కథ, కథనం, దర్శకత్వం, పాటలు అందులోని సాహిత్యం ఎప్పటికీ చెరగని ముద్రలా నిలిచిపోతాయి. అందుకే చాలా వరకూ డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తున్నారు సినీ ప్రేక్షకులు. అలాంటి ఓ ప్రేమ కావ్యం ప్రేమ దేశం సినిమా. 1996 లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అబ్బాస్. ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు. కానీ తెలుగు, తమిళ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. 50 సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

అలా మొదలైన అబ్బాస్ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశారు. అలాగే గత కొంత కాలంగా ఆయన సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి అబ్బాస్ ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడు అనేది కూడా చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యం లోనే సోషల్ మీడియాలో ఓ పేజీ తెరపైకి వచ్చింది. అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్నాడు. అక్కడే ఫ్యామిలీతో ఉంటున్నారు. మరో విషయం ఏంటంటే.. ప్రస్తుతం హీరో అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తున్నారు. ఇలాంటి ఓ ఉద్యోగంలో ఎంతోమందిని మోటివేట్ చేస్తూ.. చాలామందిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అబ్బాస్. ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ స్టైల్ కి, స్మైల్ కి ఫిదా అయిపోయిన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. చాలా తక్కువ టైమ్ లోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010 తర్వాత ఆయన రూట్ మార్చుకున్నారు.

అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ, ప్రత్యేకమైన లైఫ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. న్యూజిలాండ్ లో తన కుటుంబంతో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పారు అబ్బాస్. అబ్బాస్ తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఎంటర్ టైన్ చేశారు. ఎన్నో సినిమాలకు తనదైన విభిన్నమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.