Hema Bites Shiva Balaji : ఛీ..ఛీ, ఇదెక్క‌డి దారుణం.. శివ బాలాజీని హేమ అలా కొరికేసిందేంటి?

Hema Bites Shiva Balaji: మా ఎన్నిక‌లు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల స్థాయిలో మా ఎల‌క్ష‌న్స్ జ‌రుగుతుండ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఎల‌క్ష‌న్స్ స‌మయంలోను ఒక ప్యానెల్ స‌భ్యులు మ‌రో ప్యానెల్‌పై విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అందరం ఒక్కటేనని విష్ణు, ప్రకాశ్ రాజ్ చెప్పిన కాసేపటికే.. వీరి గ్రూప్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికలకు ముందే కాదు.. పోలింగ్ సమయంలో.. మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

విష్ణు ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ వర్గానికి చెందిన అభ్యర్థులపై మోహన్ బాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మా సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చారని మంచు విష్ణు మండిపడ్డారు.

అయితే హేమ.. శివ బాలాజీ చేయి కొరికింద‌ని మీడియాతో చెప్పాడు న‌రేష్‌. అంతేకాదు కొరికిన చేతిని కూడా చూపించాడు. అయితే ఇదే విష‌యంపై హేమ స్పందించింది. లోప‌ల చాలా గొడ‌వ‌గా ఉంది. ఆయ‌న ఏం చేయ‌కుండానే కొరికేస్తామా,ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత మాట్లాడ‌తాను అంటూ హేమ పేర్కొంది. కాగా, ప్రకాశ్ రాజ్ గన్‌మెన్లను లోపలికి వెళ్లకుండా ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మా ఎన్నికల్లో ఇప్పటికే చాలా మంది ఓటు హక్కు వినియోగించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె నవీన్, సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, సుమన్, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రాఘవ ఓటువేశారు.