Hema: శ్రీదేవి డూప్‌గా కనిపించిన హేమ‌..ఈ విష‌యం ఎంత మందికి తెలుసు?

Hema: సినిమాల‌లో డూప్‌ల అవ‌స‌రం త‌రచుగా ఉంటుంది. స్టంట్స్ స‌మ‌యంలోనే లేదంటే డ్యూయ‌ల్ రోల్స్ అప్పుఉడ డూప్ అవ‌సరం ప‌డుతుంది. అప్పుడు ఇప్పుడు డూప్‌లు ఉంటూనే ఉన్నారు.అయితే ఈ మ‌ధ్య కొంద‌రు స్టార్స్ మాత్రం స్టంట్స్ చేసేట‌ప్పుడు డూప్‌లు అవ‌సరం లేద‌ని చెప్పి వారే రిస్కీ ఫైటింగ్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదం బారిన ప‌డినా కూడా ఏ మాత్రం బెద‌ర‌డం లేదు.

Hema As Dupe Artist for Sridevi
Hema As Dupe Artist for Sridevi

గ‌తంలో క‌థ‌కు అనుగుణంగా డూప్‌ల‌ను త‌ప్ప‌క ఉప‌యోగించేవారు. డ్యూయ‌ల్ రోల్స్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్స్‌ని త‌ప్ప‌క ఉప‌యోగించేవారు. అప్పట్లో ఎన్టీఆర్ డూప్‌గా సత్యనారాయణ పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు ఇద్దరు పర్సనాలిటీస్‌గా దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ డూప్‌గా స‌త్యనారాయ‌ణ చాలా ఫేమ‌స్ అయ్యారు. ఇక నాగార్జున హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా కోసం శ్రీకాంత్ డూప్‌గా న‌టించారు.

చిరంజీవి ముగ్గురు మొన‌గాళ్లు కోసం చిరు డూప్‌గా చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ సుబ్బారావుతో పాటు నటుడు హరిబాబు నటించారు. మరోవైపు ప్రశాంత్ హీరోగా నటించిన ‘తొలి ముద్దు’ సినిమాలో దివ్యభారతి డూప్‌గా రంభ నటించింది. అపుడు దివ్య భారతి ఆత్మ హత్య చేసుకోవడంతో రంభనే ఆమె డూప్‌గా న‌టించింది. ఇక వెంక‌టేష్ న‌టించిన ప‌లు సినిమాల‌లో ఆయ‌న డూప్‌గా సురేష్ బాబు న‌టించారు.

ఇలా ప‌లువురు స్టార్స్‌కి కొన్ని సంద‌ర్భాల‌లో డూపులుగా ప‌లువురు న‌టించ‌గా, శ్రీదేవికి ఓ స‌న్నివేశంలో డూప్ అవ‌స‌రం ఏర్ప‌డ‌డంతో హేమ‌ని ఉప‌యోగించారు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని ఓ సీన్‌లో భాగంగా శ్రీదేవి స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టే సీన్ ఉంటుంది. ఈ సందర్భంగా అమ్రిష్ పురి.. శ్రీదేవి కోసం వచ్చే సీన్ ఉంటుంది.

శ్రీదేవికి ఈత రాక‌పోవ‌డంతో స్విమ్మింగ్ వ‌చ్చిన అమ్మాయి కోసం వెతుకుతుండ‌గా, ఎవ‌రో హేమ‌ని రిష‌న్ చేశార‌ట‌. అప్పుడు హేమ ..జ‌గదేకవీరుడు అతిలోకసుందరి షూటింగ్ జరుగుతున్న ఊటీలో మరో షూటింగ్‌లో ఉంది. దీంతో సదరు సినిమా వాళ్ల పర్మిషన్‌ తీసుకొని హేమను ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో శ్రీదేవి డూప్‌గా యాక్ట్ చేయడానికి తీసుకెళ్లారు.

ఈ సినిమాను మ‌రోసారి చూసినప్పుడు స్విమ్మింగ్ పూల్ షాట్‌లో హేమ‌ను గుర్తు ప‌ట్టండి.ఇక వెంకటేష్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి ఫ్రెండ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ప్ర‌స్తుతం హేమ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీ అయింది హేమ‌. మా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో పోటీ చేసేందుకు కూడా సిద్ధ‌మైంది.