హెబ్బా పటేల్ కెరీర్ క్లోజ్ అవడానికి ఆ తప్పే కారణం ….?
Vedha - December 16, 2020 / 08:30 AM IST

21 ఎఫ్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమై.. మెస్మరైజింగ్ అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన హెబ్బా ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. గ్లామర్ డోస్ పెంచినా క్రేజీ ఆఫర్స్ అమ్మడు చెంతకు చేరలేదు. స్టార్ హీరోలు సైతం అమ్మడు పై దృష్టి సారించలేదు. ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ గా మారడంతో డైరెక్టర్లు సైతం ఆమెను పక్కన పెట్టేశారు. కొద్దో గొప్ప సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద కుదేలు అయ్యాయి. దీంతో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ వెబ్ సిరీస్ లలో, చిన్న చిన్న సినిమాల్లో నటిస్తోంది హెబ్బా పటేల్ . ఇదే టైమ్ లో కరోనా విజృంభించడంతో ఆమె కెరీర్ కాస్త చతికిలబడింది అని చెప్పాలి.
ప్రస్తుతం అమ్మడి కి ఎలాంటి ఆఫర్ లు లేకపోవడం తో తీవ్ర నిరాశలో ఉన్నట్లు టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.బోల్డ్ గా నటించేందుకు అమ్మడు సిద్ధంగా ఉన్నా ఆఫర్లు ఇచ్చేందుకు మాత్రం డైరెక్టర్లు సిద్ధంగా లేరని అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఒకటి రెండు సినిమాలు తప్ప అమ్మడి చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవని ఇండస్ట్రీ వర్గాల టాక్. అసలు హెబ్బా కు ఈ పరిస్థితి రావడానికి ఆమె కథలే అని సినీ వర్గాలు అంటున్నాయి. సినిమాలను ఎంచుకోవడంలో హెబ్బా పెద్ద తప్పు చేసిందని ఆమె అభిమానుల అభిప్రాయపడుతున్నారట.
సరైన కథలు ఎంచుకుంటే హెబ్బా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యేదని తెగ ఫీల్ అవుతున్నారు. నిజానికి స్టార్ హీరోయిన్ అయ్యేంత మేటర్ హెబ్బా పటేల్ లో బోలెడంత ఉంది. కానీ అమ్మడి తొందరపాటే ఆమె కెరీర్ కు అడ్డంకిగా మారిందని అంటున్నారు. అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా హాట్ ఫోటో షూట్ లతో డైరెక్టర్ ను మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ అమ్మడు. ఇటీవలే రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా సినిమా చేసి హిట్ అందుకుంది. ఇక ఎనర్జిటిక్ హీరో రాం నటించిన రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ గనక హిట్ అయితే మళ్ళీ వరసగా స్పెషల్ సాంగ్స్ లో అలాగే సినిమాలలో అవకాశాలు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.