Hebah Patel : మెరూన్ క‌ల‌ర్ శారీలో రెచ్చిపోయిన హెబ్బా… అమ్మ‌డి అందాల‌కు అందరు ఫిదా

Hebah Patel : 2014 వచ్చిన ‘అలా ఎలా ?’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ త‌న అందంతో పాటు అభిన‌యంతో ఎంత‌గానో అల‌రించింది.

Hebah Patel Saree Photo shoot
Hebah Patel Saree Photo shoot

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి.

Hebah Patel Saree Photo shoot
Hebah Patel Saree Photo shoot

హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.

Hebah Patel Saree Photo shoot
Hebah Patel Saree Photo shoot

తాజాగా హెబ్బా మెరూన్ క‌ల‌ర్ శారీలో పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెబ్బా పటేల్ లుక్ బావుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.