ఎద అందాలతో వల.. హెబ్బా పటేల్ దెబ్బకు అందరూ ఫిదా!
NQ Staff - November 1, 2020 / 03:07 PM IST

హెబ్బా పటేల్ తెరపై ఎంత బోల్డ్‌గా ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి వందరెట్లు బోల్డ్‌గా ఉంటుంది. తెలుగు తెరపై క్రేజీ హీరోయిన్‌గా మారిన హెబ్బా పటేల్‌కు లక్ అంతగా కలిసి రావడం లేదు. తన కెరీర్‌లో కుమారి 21ఎఫ్ లాంటి మరో హిట్ చిత్రం మళ్లీ రాలేదు. ఆ ఒక్క చిత్రం హెబ్బా పటేల్‌ను ఓ రేంజ్‌లో కూర్చోబెట్టింది. బోల్డ్ పాత్రలకు, బోల్డ్ డైలాగ్‌లకు హెబ్బా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అలా కొన్ని బోల్డ్ కంటెంట్ చిత్రాల్లో హెబ్బా నటించింది. కానీ అవి అంతగా వర్కవుట్ కాలేదు.
కుమారి 21 ఎఫ్ కంటే ముందు చేసిన అలా ఎలా బాగానే క్లిక్ అయింది. అయితే కుమారి 21ఎఫ్ లాంటి భారీ హిట్ వచ్చాక మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ కొట్టలేకపోయింది. ఆడో రకం ఈడో రకం, నాన్న నేను నా భాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా ఇలా ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్కటి వర్కవుట్ అవ్వలేదు. హెబ్బా పటేల్ అంటే సిటీ గర్ల్, మోడ్రన్ అండ్ బోల్డ్ పాత్రలే చేస్తుందని అందరూ అనుకుంటారు.
కానీ మొదటి సారిగా ఓ భిన్న ప్రయత్నం చేస్తోంది హెబ్బాపటేల్. పల్లెటూరి అమ్మాయిలా నటిస్తూ మొత్తం వేషాదారణనే మార్చేసింది. ఒదెల రైల్వేస్టేషన్ అంటూ సంపత్ నంది తీస్తోన్న చిత్రంలో హెబ్బా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తోందని తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఈ మూవీ స్టిల్స్, లంగావోణిలో ఉన్న పిక్స్‌ను షేర్ చేసిన హెబ్బా తాజాగా అదిరిపోయే హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఎద అందాలనో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.