Hebah Patel: బ‌ట్టల సైజు త‌గ్గించ‌డానికి కార‌ణం చెప్పిన బ‌బ్లీ బ్యూటీ

Hebah Patel: ఈ కాలం నాటి అందాల భామ‌లు ఆఫ‌ర్స్ కోసం గ్లామ‌ర్ షోని ఎక్కువ‌గా న‌మ్ముకుంటున్నారు. ఆఫ‌ర్స్ త‌గ్గుతున్నాయ‌ని అనిపిస్తే చాలు వెంట‌నే అందాల ఆర‌బోత మొద‌లు పెడుతున్నారు. అయితే ఇది కొంద‌రికి స‌త్ఫ‌లితాన్ని ఇస్తుండ‌గా, మరి కొంద‌రికి మాత్రం ఎదురు చూపులే మిగిలిస్తుంది. కుమార్ 21ఎఫ్ సినిమాతో త‌న కెరీర్‌ని గాడిలో పెట్టుకున్న అందాల ముద్దుగుమ్మ హెబ్బా ప‌టేల్. మొద‌ట్లో గ్లామ‌ర్ షోపై పెద్ద‌గా ఆసక్తి చూప‌ని హెబ్బా ఆ త‌ర్వాత రెచ్చిపోయింది. సినిమాలలోనే కాదు సోష‌ల్ మీడియాలోను తెగ గ్లామ‌ర్ షో చేస్తూ అబ్బా.. ఇదేంద‌బ్బా అనేలా చేసింది.

Hebah Patel

ఎక్కడి పోతావు చిన్నవాడ, 24 కిస్సెస్, మిస్టర్ వంటి సినిమాలతో హెబ్బా పటేల్ టాలీవుడ్‌లో దూసుకొచ్చింది. ఆ త‌ర్వాత ఆఫ‌ర్స్ కరువ‌య్యాయి. చివరగా ఓరేయ్ బుజ్జిగా అనే సినిమాతో హెబ్బా పటేల్ ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కూడా అమ్మ‌డిని నిరాశ‌ప‌చ‌డంతో కేవ‌లం సోష‌ల్ మీడియాతోనే అభిమానుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంలేనందున బాక్సాఫీస్ వద్ద ఆమె సినిమాలు డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయ‌నే టాక్ ఉంది. అయితే పొట్టి బట్టల్లో ఆమె చేసే ఎద అందాల ప్రదర్శన నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుంది. తాజాగా క్లీవేజ్ షోతో హీటు పుట్టిస్తున్న హెబ్బా సోష‌ల్ మీడియాని అయితే షేక్ చేస్తుంది.

Hebah Patel

త‌న సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసిన హెబ్బా ప‌టేల్ ‘బయటికి వెళ్లడం తగ్గింది కాబట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేశా’ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో మరింత వైరల్ అవ‌డమే కాదు హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో అబ్బా అంటూ యువ‌త‌తో అనిపించుకుంటున్న హెబ్బా వెండితెర‌పై మాత్రం అంత‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బర‌చ‌లేక‌పోతుంది. రాశీ ఖ‌న్నా, రెజీనా లాంటి అందాల భామ‌లు బోల్డ్‌నెస్‌తో అంతో ఇంతో నెట్టుకొస్తున్న‌ప్ప‌టికీ హెబ్బా మాత్రం పూర్తిగా చ‌తికిల‌ప‌డ‌డం అభిమానుల‌కు కూడా రుచించ‌డం లేదు.