Radhe Shyam: రాధే శ్యామ్ కోసం భారీ వీఎఫ్ఎక్స్.. క్రిస్మస్‌కు మూవీని విడుదల చేస్తారని టాక్
Priyanka - May 5, 2021 / 03:31 PM IST

Radhe Shyam సాహో చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేయాలని అనుకున్నారు. కాని కరోనా వలన కొన్నాళ్లు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.
రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ కొద్ది భాగం మిగిలి ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఇటలీ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రస్తుత కరోనా నేపథ్యంలో అక్కడి పరిస్థితులని వీఎఫ్ఎక్స్‌లో మేనేజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వీఎఫ్ఎక్స్‌లో సీన్స్ క్రియేట్ చేయాలంటే చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో మూవీ దసరాకు లేదంటే క్రిస్మస్‌కు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.పీరియాడికల్ మూవీగా రాధేశ్యామ్ చిత్రం తెరకెక్కగా, ఇటీవల చిత్ర గ్లింప్స్ ఒకటి విడుదలైంది. ఈ మోషన్ పోస్టర్ టీజర్ కే 20 మిలియన్ వ్యూస్ రాగా, దీంతోచఇండియా లోనే మరో యూనిక్ ఫీట్ ను ప్రభాస్ టచ్ చేశాడు.