పునర్నవి పెళ్లి చేసుకునే అతను ఎవరో కాదు.. మీరు ఊహించలేరు.
Admin - October 29, 2020 / 01:45 PM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ లో లవ్ ట్రాక్ నడిపించిన పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ అందరికి తెలిసిందే. అయితే చాలా వరకు వీరిద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే తెలుసు. ఇక బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చాక మరింత ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అయితే ఇక బిగ్ బాస్ అయిపోయాక రాహుల్, పునర్నవి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని నెటిజన్లు ప్రశ్నించారు. ఇక అలా వస్తున్న ప్రశ్నలకు ఈ ఇద్దరు స్పందిస్తూ.. మేము ఇద్దరం మంచి స్నేహితులమని, మీరు అనుకున్నట్టు ఎలాంటి ఉద్దేశ్యం మాకు లేదని సమాధానం ఇచ్చారు. అలాగే ఒకానొక సమయాన రాహుల్ సిప్లిగంజ్ తల్లిదండ్రులు అయితే పునర్నవికి ఇష్టమైతే పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కానీ రాహుల్ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలకూ పునర్నవి కనీసం స్పందించలేదు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా సోషల్ మీడియాలో పునర్నవి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. చివరకు ఇలా జరుగుతుంది అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన చేయిని మరొకరి చేయి పట్టుకున్న ఒక ఫోటోను షేర్ చేసింది పునర్నవి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పునర్నవి చేతి వేలుకు ఒక డైమండ్ రింగ్ పెట్టుకొని ఉంది. దీనితో ఆమెకు ఎంగేజిమెంట్ అయిందని అభిమానులు భావిస్తున్నారు. ఇక అందరు అనుకున్నట్లే పునర్నవికి ఎంగేజిమెంట్ జరిగింది.
కానీ అందరు అనుకున్నట్లు రాహుల్ ని పెళ్లి చేసుకోవడం లేదు. మరి ఎవరు పునర్నవిని పెళ్లి చేసుకునేది అని అందరికి ఒక సందేశం ఉండే ఉంటుంది. అయితే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారున్ని పునర్నవి పెళ్లాడుతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలో ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి ఫోటోను కూడా పంచుకోనుందట. ఇక ఒక్కసారిగా పునర్నవి ఎవరు ఊహించని విధంగా పోస్ట్ పెట్టె సరికి అందరిని షాక్ కు గురిచేసింది.