BALA KRISHNA: ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటికి రాని ఈ ఫోటోలు చూసారా.. షాకింగ్ లుక్‌లో బాల‌య్య‌

BALA KRISHNA మహానాయకుడు, కథానాయకుడు, మహానటుడిగా తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడిగా నందమూరి రామారావు నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు అందజేయాలనే నిశ్చయంతో బాలకృష్ణ బయోపిక్ ను తెరకెక్కించారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేశారు. నందమూరి తారకరామారావు జీవిత చరిత్రలో బాలకృష్ణ నటించడంతో ఈ సినిమాపై మొదట్నుండి ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతమైన నటనను అందించారు. ఎన్టీఆర్ సతీమణిగా విద్యబాలన్ చేసిన నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా అంతా పూర్తి ఎమోషనల్ కంటెంట్ తో ఆయన జీవితంలో జరిగిన ఎన్నో మలుపులు, ప్రశ్నలు, పరిస్థితులు, అనుభవాలతో సినిమా కథ సాగిపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బాల్యం, ఉద్యోగం చేయడం ఇష్టంలేక సినిమాల్లోకి రావడం.. ఎన్నో వేల పాత్రలు, కథలు కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో ముఖ్యంగా ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ ని ఎక్కువగా ఎలివేట్ చేశారు.

నందమూరి తారకరామారావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆధరణ ఉంది. ఆయనంటే ఎనలేని అభిమానం. ఆయన జీవితంలో ఎవ్వరికి తెలియని కోణాల్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. వీటికి సంబంధించిన సీన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిష్. ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ లో కూడా రాజకీయ రంగప్రవేశం, ప్రజాభిమానం, వారి ఆదరణ, సీఎం గా ఎదిగిన విధానం ఇలా ప్రతిఒక్కటి ఎంతో ఆసక్తికరం అని చెప్పుకోవాలి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ భీష్మ అవతారంలో ఉన్న ఫోటోలు. భీష్మునిగా ఎన్టీఆర్ అభినయం వర్ణనాతీతం. అయితే ఈ సినిమాలో భీష్మావతారంలో ఉన్న సీన్లు రాకపోవడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement