Harish shankar: స్టుపిడ్ అంటూ సీరియ‌స్ అయిన హ‌రీష్ శంక‌ర్ .. ఎందుకో తెలుసా?

Harish shankar: గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో కొద్ది రోజులుగా బిజీగా ఉన్నాడు హ‌రీష్ శంక‌ర్. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హ‌రీష్ శంక‌ర్ నెటిజ‌న్స్‌కి త‌న‌దైన శైలిలో బ‌దులిస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటాడు.

harish shankar serious on netizens
harish shankar serious on netizens

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో అంద‌రి గుండెల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో హ‌రీష్ శంక‌ర్ ఒక డాక్టర్ వాంగ్మూలాన్ని ప్రజలకు వినిపించడం సంచలనంగా మారింది. అయితే దీనిని ప్రజలు తప్పుబడుతున్నారు. సదరు డాక్టర్ తో కలిసి హరీష్ శంకర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు.

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్యంగా ఓమిక్రాన్ కేసుల విషయానికి వస్తే భయపడాల్సిందేమీ లేదనేస్తూ.. డాక్టర్ వివరిస్తున్న వీడియోను పంచుకున్నారు. వీడియోలో ప్రయివేట్ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ గురువా రెడ్డి వివరణ ఉంది. ఓమిక్రాన్ సాధారణ జలుబు తప్ప ఇంకేదీ కాదని టీకాలు వేయని వ్యక్తులు మాత్రమే ఎక్కువగా ప్రభావితమవుతారని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన కోరారు.

హరీష్ శంకర్ షేర్ చేసిన ఈ వీడియోకు రిప్లైగా ఒక నెటిజన్ హరీష్ శంకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, తీవ్ర ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన దర్శకుడు ఏదైనా మంచి జరుగుతుందని నిపుణుడు చెప్పినప్పుడు కూడా కొంతమంది ఆశలు పెట్టుకోరు అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

harish shankar serious on netizens1
harish shankar serious on netizens1

హరీష్ శంకర్ “మీలాంటి మూర్ఖులు నిరుత్సాహానికి గురవుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వారు ఎప్పుడూ ఒక నిపుణుడు ఏదైనా మంచిని చెప్పినప్పుడు, అతను పదేపదే జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పినప్పుడు కూడా ప్రజలకు ఆశలు కల్పించాలని కోరుకోరు !!” అంటూ ఘాటుగా స్పందించారు.