Regina Cassandra And Harish Shankar : హీరోయిన్‌ని మర్చిపోయావ్.. హరీష్ శంకర్.! గుర్తు చేసిన రెజినా కసాండ్రా.!

NQ Staff - September 24, 2022 / 10:58 PM IST

Regina Cassandra And Harish Shankar : హీరోయిన్‌ని మర్చిపోయావ్.. హరీష్ శంకర్.! గుర్తు చేసిన రెజినా కసాండ్రా.!

Regina Cassandra And Harish Shankar : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా వచ్చి ఏడేళ్ళయ్యింది. ఈ నేపథ్యంలో, ఆ సినిమా గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా.

సాయి ధరమ్ తేజ్‌తో కలిసి వున్న ఫొటోల్ని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే, సినిమా కోసం పని చేసిన పలువుర్ని గుర్తు చేసుకున్నాడు తన ట్వీటులో. అయితే, ఈ విషయమై హీరోయిన్ గుస్సా అయ్యింది.

నన్ను మర్చిపోయావ్..

‘మమ్మల్ని బహుశా దర్శకుడు మర్చిపోయినట్లున్నాడు..’ అంటూనే, థ్యాంక్స్ చెప్పింది హరీష్ శంకర్‌కి, ‘సీతతో అంత ఈజీ కాదు’ అంటూ సాగే తన పాత్రను డిజైన్ చేసినందుకు.

రెజినా ట్వీటుపై స్పందించాడు హరీష్ శంకర్. ‘సారీ డియర్..’ అంటూ ట్వీటేశాడు. ‘నీతో అంత వీజీ కాదు..’ అని ప్రూవ్ చేశావ్.. అని చెప్పుకొచ్చాడు. ‘సీత పాత్రలో చాలా బాగా చేసినందుకు థ్యాంక్స్’ చెప్పాడు హరీష్ శంకర్. ‘నీతో కలిసి వర్క్ చేయడం చాలా బావుంది.. ఎప్పటికీ గుర్తుంటుంది..’ అని కూడా హరీష్ శంకర్ పేర్కొన్నాడు.

మరోపక్క, హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హరీష్ శంకర్‌కి థ్యాంక్స్ చెప్పాడు. ఇదిలా వుంటే, హరీష్ శంకర్ తన తదుపరి సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ని పట్టాలెక్కించే సమయం కోసం చాన్నాళ్ళుగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us