Pawan Kalyan: పవన్ కోసం డిఫ‌రెంట్ జోనర్ కథను సిద్ధం చేసిన హరీష్ శంకర్.. ఫ్యాన్స్‌లో ఆనందం

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. చేసింది ఒక్క సినిమానే అయినా వాళ్లు చరిత్ర సృష్టిస్తుంటారు. అలాంటి కాంబినేషన్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్. ఈ ఇద్దరి పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా గబ్బర్ సింగ్. దాదాపు 11 ఏళ్ల పాటు ఎలాంటి విజయం లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ కు.. గబ్బర్ సింగ్ సినిమాతో 9 ఏళ్ళ కింద ఎప్పటికీ మరిచిపోలేని విజయం అందించాడు హరీష్ శంకర్.

Harish Shankar, Pawan Kalyan

ఇది పేరుకు హిందీ సినిమా రీమేక్ అయినా కూడా స్ట్రైట్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించాడు హరీష్. నిజానికి గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత ఒరిజినల్ దబాంగ్ సినిమా చేసిన సల్మాన్ ఖాన్ మెచ్చుకున్నాడు. తమకంటే సినిమా చాలా బాగా తెరకెక్కించారు అంటూ హరీష్ శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు సల్మాన్.

దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. దాంతో అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల హరీష్ శంకర్ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఇక దీన్ని ఆలస్యం చేయకూడదని పవన్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు కమిట్మెంట్ ఇచ్చి సంవత్సరం దాటిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి కొడుకులుగా పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. ఒకటి చాలా జోవియల్ గా ఉండే పాత్ర అయితే.. మరోటి మాత్రం ప్రశ్నించే పాత్ర. సామాజిక బాధ్యత కలిగిన పాత్ర అని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో విద్యా వ్యవస్థను ప్రశ్నించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

జెంటిల్ మెన్ నుంచి నిన్నటి యువరత్న సినిమా వరకు చాలా దాంట్లో విద్యావ్యవస్థను ప్రశ్నించారు హీరోలు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా పవన్ స్టైల్ లో తన శైలిలో ప్రశ్నించడానికి వచ్చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుంది. ప్రతి నెలలో 10 రోజులు హరీష్ శంకర్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలకు కూడా కమిట్మెంటు ఇచ్చాడు పవర్ స్టార్.

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర సినిమా కూడా లైన్ లోనే ఉన్నాయి. వీటితో పాటు మరో మూడు సినిమాలు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి నెలకు పది రోజులు హరీష్ సినిమాకు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ అందించిన హరీష్ శంకర్.. ఈసారి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సోషల్ మెసేజ్ ఉన్న కథతో వస్తున్నాడు.