Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్‌ని క‌లిసిన హ‌రీష్ శంక‌ర్.. ఫుల్లీ లోడెడ్ అంటూ ట్వీట్‌

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబ‌ర్ 10న రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. విజయ దశమి సందర్భంగా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అదేరోజు సాయి తేజ్‌ పుట్టిరోజు కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీలో ఆనందం మరింత రెట్టింపయింది

TheNewsQube-

సాయిధ‌ర‌మ్ తేజ్ ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చాడో లేదో వెంట‌నే ఆమె పెళ్లికి సంబంధించి ప్ర‌చారం న‌డిచింది.సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ప్రచారం మొదలైంది. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్నట్టు సందేహం కలిగేలా కొన్ని విషెస్ రావడంతో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచులర్‌ లిస్ట్‌ నుంచి త్వరలోనే తప్పుకోనున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.

Harish Shankar Meet with Sai Dharam Tej after Accident
Harish Shankar Meet with Sai Dharam Tej after Accident

సాయి ధరమ్ తేజ్ కుటుంబం, ప్రత్యేకించి సాయి తల్లి ఆయన వివాహం చేసుకోవాలని కోరుకుంటోందని, తద్వారా వీలైనంత త్వరగా సాయి ఒక ఫ్యామిలీగా మారాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత, అతని కుటుంబం కొంతకాలంగా ఆ విషయంలో చాలా బాధ పడుతున్నట్లు కనిపిస్తుంది.

సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ఇంట్లో, సంతోషంగా గ‌డుపుతున్నాడు. ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఆయ‌న‌ను ప‌ల‌క‌రించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రీసెంట్‌గా హ‌రీష్ శంక‌ర్.. సాయి ధ‌ర‌మ్ తేజ్‌ని ప‌రామ‌ర్శించారు.

అత‌ని చేతిలో చేయి వేసిన ఫొటోని షేర్ చేస్తూ.. నా సోద‌రుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ని క‌లిసా. సంతోషంగా ఉంది. అత‌ను చాలా ఫిట్ గా ఉన్నాడు. మ‌ళ్లీ సినిమాలలో న‌టించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు.ఫుల్లీ & మళ్ళీ లోడెడ్ అంటూ హ‌రీష్ శంక‌ర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.హ‌రీష్ శంక‌ర్ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు.