Harish Shankar : వెంకటేశ్ మహాకు క్లాస్ పీకిన హరీశ్ శంకర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..!
NQ Staff - March 11, 2023 / 03:21 PM IST

Harish Shankar : టాలీవుడ్ లో ఇప్పుడు వెంకటేశ్ మహా చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేరాఫ్ కంచెర పాలెం సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకటేశ్ మహా చేసిన కామెంట్లపై ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ.. ఉదాహరణగా కేజీఎఫ్ చిత్రంపై దారుణమైన కామెంట్లు చేశారు.
యష్ పాత్రను అయితే నీచ్ కమీన్ కుత్తే అంటూ దారుణంగా మాట్లాడాడు. దాంతో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇక తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఈ వివాదం మీద స్పందించాడు. బలగం సక్సెస్ మీట్ కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఈ నడుమ చాలామంది క్లాస్ సినిమాలు, మాస్ సినిమాలు అని విభజిస్తున్నారు.
పెద్ద హిట్లు అయితేనే..
అలా విభజించడం కేవలం ఆ సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికి మాత్రమే. కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు పెద్ద హిట్లు అయితేనే బయ్యర్ల దగ్గర డబ్బులు ఉంటాయి. వారు మన సినిమాలను కొనుగోలు చేస్తారు. గతంలో శంకరాభరణం, స్వాతిముత్యం లాంటి సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి.
వాటిని మాస్ ప్రేక్షకులే చూశారు. కాబట్టి సినిమాను విభజించ కూడదు. కేవలం ఇది మన సినిమా అని హాత్రమే భావించాలి అంటూ తెలిపాడు హరీశ్ శంకర్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వెంకటేశ్ మహా పేరు తీయకుండానే ఏకిపారేశాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.