Harish Shankar : ఆదిపురుష్ సినిమాపై పడి ఏడవకండ్రా.. హరీష్ శంకర్ కౌంటర్..!
NQ Staff - June 16, 2023 / 08:49 AM IST

Harish Shankar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటిసారి రాముడిగా నటిస్తున్న మూవీ ఆదిపురుష్. ఈ జనరేషన్ హీరోలు ఇలా రామాయణం సినిమాను చేయడం అంటే సాహసం అనే చెప్పుకోవాలి. అయితే ఆదిపురుష్ ను విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ జనరేషన్ కు తగ్గట్టు తీయాలన్నది ఓం రౌత్ ఆలోచన. అందుకే ఆయన అన్ని విధాలుగా దీన్ని తీర్చదిద్దారు.
ఇదిలా ఉండగా ఆదిపురుష్ మూవీ మీద మొదటి నుంచి వివదాలు, నెగెటివిటీ చుట్టుముడుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా రామాయణం కథ డైవర్ట్ అవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సిరీస్ కు ఏదీ సాటి రాదు అని పోస్టు చేశాడు.
ఒక రకంగా ఇది ఆదిపురుష్ మూవీని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది. ఇది చూసిన హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. రామాయణ్ సిరీస్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇలా మనలో మనమే రామాయణంను వ్యతిరేకించడం బాధాకరంగా అనిపిస్తోంది. ఐక్యత కూడా సనాతన ధర్మంలో భాగమే అని అందరూ గుర్తించాలి అంటూ హరీష్ కౌంటర్ ఇచ్చారు.

Harish Shankar Given Reply In His Own Style On Adipurush Movie Controversy
దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆదిపురుష్ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. మరకొన్ని గంటల్లో ఆదిపురుష్ రివ్యూలు బయటకు వస్తాయి. చూస్తుంటే పాజిటివ్ వేవ్ కనిపించే విధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
No one ever doubted “ Ramayan “ ;
yet its very sad to see sacred handle like @LostTemple7 posting this just before the release of Adipurush .. “unity “ is also part of Sanatan Dharm… https://t.co/TVPFhun8oh— Harish Shankar .S (@harish2you) June 15, 2023