harika : బిగ్ బాస్ తరువాత ఫుల్ స్వింగ్‌.. హారికకు కళ్లు చెదిరే ఆఫర్స్!

Bigg Boss Harika Got One Movie and One web series
Bigg Boss Harika Got One Movie and One web series

harika: బిగ్ బాస్ నాల్గో సీజన్ తరువాత ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కొందరు ఆల్రెడీ ప్రాజెక్ట్‌లను మొదలెట్టేశారు. ఇంకొందరు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. మరి కొందరు ఆల్రెడీ వెండితెరపై చిందులు వేశారు. అలా ఎవరికి వారు తమ తమ ఫ్యూచర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంత వరకు మోనాల్, సోహెల్, అరియానా ల సినిమా అప్డేట్లు మాత్రమే బయటకు వచ్చాయి.

సోహెల్ ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించేశాడు. ఫిబ్రవరిలో షూటింగ్ ఉంటుందని కూడా చెప్పేశాడు. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ కాల్ కూడాజరిగింది. ఇక అరియానా విషయానికి వస్తే.. తాజాగా ఓ సినిమా అప్డేట్‌ను ఇచ్చింది. రాజ్ తరుణ్‌ తో కలిసి అరియానా ఓ సినిమాను చేస్తుంది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. షూటింగ్ కూడా మొదలైనట్టు కనిపిస్తోంది.

హారికకు కళ్లు చెదిరే ఆఫర్స్..

మోనాల్ అయితే ఏకంగా డ్యాన్స్ ప్లస్ షోతోనే ఫుల్ బిజీగా ఉంది. ఐటెం సాంగ్‌తో అదరగొట్టేసింది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా చేతిలో ఉన్నాయట. అభిజిత్ మాత్రం ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ఇంకా ఫిల్టర్ చేసే పనిలోనే ఉన్నాడు. నిన్నే ఓ కథను మూడు గంటల పాటు నెరేట్ చేస్తున్నా కూడా విన్నాడట. అంటే ఆ కథ దాదాపుగా ఓకే అయ్యేలానే ఉంది. ఇక తాజాగా హారిక అసలు విషయంచెప్పింది.

Bigg Boss Harika Got One Movie and One web series
Bigg Boss Harika Got One Movie and One web series

బిగ్ బాస్ తరువాత ఫుల్ స్వింగ్‌ : harika

తాను ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, ఓ సినిమాను ఒప్పుకున్నట్టు చెప్పింది. అంతే కాకుండాదేత్తడిలో వచ్చే వారంఓ వీడియో రాబోతోందని చెప్పింది. మొత్తానికి ఇటు యూట్యూబ్, అటు ఓటీటీ, ఇటు వెండితెరపై హారిక తన సత్తాచాటేందుకు రెడీ అయిందన్న మాట. మొత్తానికి బిగ్ బాస్ వల్ల హారికకు బాగానే మేలు జరిగింది.

Advertisement