Harihara veeramallu : వీరమల్లు మార్షల్ ఆర్ట్స్ ..సినిమాకే హైలెట్..!

Harihara veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కాగా ఎన్నో ఏళ్ళ క్రితం తమ్ముడు సినిమాలో మార్షల్ ఆర్ట్స్ లో తన సత్తా చూపించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ తాజాగా తెరకెక్కుతున్న వీరమల్లు సినిమాకోసం ఆ విద్యను మరోసారి చూపించబోతున్నాడు. ఇప్పటికే సెట్స్ లో పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

harihara-veeramallu-marshal arts are highlights in movie
harihara-veeramallu-marshal arts are highlights in movie

వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు యుద్ద విద్యలను ప్రదర్శించబోతున్నాడు. కత్తి.. బల్లెం.. బాణం ఇలా అన్ని రకాల ఆయుధాలతో కూడా పవన్ పోరాటం చేస్తాడట. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ఎప్పుడో ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహిస్తున్న స్టంట్స్ కొరియోగ్రాఫర్.. పవన్ కళ్యాణ్ గారు హరి హర వీరమల్లులో చాలా ఎనర్జితో కనిపించబోతున్నట్లుగా తెలిపాడు. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న పవన్ త్వరలోనే మళ్లీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అవబోతున్నట్టు సమాచారం.

Harihara veeramallu : వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు. కాగా వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా రీసెంట్ గా వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భారీ హిట్ దక్కించుకున్నాడు.

Advertisement