Hari Teja: హ‌రితేజ కూతురు ఎంత ముద్దొస్తుందో.. క్యూట్ కామెంట్స్ పెడుతున్న నెటిజ‌న్స్

Hari Teja: న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ హరితేజ‌. ఆమె కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు బిగ్ బాస్ షో తరువాత అనేలా మారిపోయింది. బిగ్ బాస్ షోకంటే ముందుగా ఆమెకు సీరియల్స్‌లో ఎక్కువగా నెగెటివ్ రోల్స్ వచ్చేవి. బిగ్ బాస్ ఆఫ‌ర్ ఎప్పుడు వ‌చ్చిందో అప్ప‌టి నుండి హ‌రితేజ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

Hari Teja Daughter Latest Cute Photos
Hari Teja Daughter Latest Cute Photos

హ‌రితేజ ఇటీవ‌ల పండంటి బేబీకి జ‌న్మ‌నిచ్చింది. అయితే డెలివరీ సమయంలోనే కరోనా పాజిటివ్ అని రావడం, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించుకోకపోవడం, పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే అనుమానం, సాయం చేసేందుకు కూడా ఎవ్వరూ లేరని, డెలీవరి వార్డులో మా ఆయనే సేవలు చేశారంటూ ఇలా తన వ్యథను అంతా ఓ వీడియో ద్వారా కొద్ది రోజుల క్రితం వివరించింది.

Hari Teja Daughter Latest Cute Photos
Hari Teja Daughter Latest Cute Photos

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హ‌రితేజ ఇటీవ‌ల తమ ఇంటిని అభిమానులకు చూపించారు. హరి కథలు పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించిన హరితేజ కొత్త కొత్త వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తన ఇంటిని అభిమానులకు చూపించిన హరితేజ తాను ఎంతో ఇష్టపడి చేయించుకున్న ఇంటిరీయర్‌ డిజైన్స్‌తో పాటు, తన పాప కోసం చేసిన ఏర్పాట్లు ఇలా అన్నింటినీ చూపించారు. ఇక తన చిన్నారి కోసం ప్రతీ గదిలో హరితేజ ఒక ఉయ్యాలు ఏర్పాటు చేయడం విశేషం.

Hari Teja Daughter Latest Cute Photos
Hari Teja Daughter Latest Cute Photos

త‌న కూతురికి భూమి దీపక్ రావ్ అని పాపకు నామకరణం చేశారు హరితేజ దంప‌తులు . భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ. తాజాగా తన ముద్దులు కూతురి ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చెయ్యగా.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్యూర్‌ వైట్‌ గౌనులో ఉన్న భూమి దీపక్‌ రావ్‌.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ చాలా అందంగా ఉంది. వీటికి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. 2015లో దీపక్‌ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

Hari Teja Daughter Latest Cute Photos
Hari Teja Daughter Latest Cute Photos