Hari Hara Veera Mallu: భీమ్లా నాయక్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా రూపొందుతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎంత కష్టపడుతున్నాడో మనం చూశాం. ఇటీవలే యాక్షన్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ వీడియో ఒకటి రిలీజ్ చేయగా.. అందులో పవన్ కళ్యాణ్ కష్టం కనిపిస్తుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా, మూవీపై వస్తున్న రూమర్స్ ఆందోళన కలిగిస్తున్నాయి.
క్రిష్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏర్పాటు చేసిన మొత్తం సెటప్ తో పవన్ ఇంప్రెస్ అయ్యాడట. కానీ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ విషయం మాత్రం పవన్ కల్యాణ్ ను డిసప్పాయింట్ చేసిందని ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఓ వైపు సినిమా మధ్యయుగ భారతదేశం బ్యాక్ డ్రాప్ కథ కావడం…మరోవైపు సినిమాలోని పాత్రలు కూడా చాలా మోడ్రన్‌గా, కొత్తగా కనిపిస్తున్నాయని..అసలు లుక్‌ల ఆధారంగానే క్రిష్ కాస్ట్యూమ్స్‌ను ఎక్కువగా డిజైన్ చేశాడని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ బడ్జెట్ ఇష్యూ వలన ఆగిందనే మరో ప్రచారం కూడా ఇటీవల జోరుగా సాగింది. ఇలా ఈ సినిమాపై పలు ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి కానీ వాటిలో నిజం లేదని తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై టాక్ వినిపిస్తోంది. మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ భారీ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పవన్ కెరీర్‌లోనే ఇప్పటివరకు రాని విధంగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే హరిహర వీరమల్లు సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు నిజమైన పండగను పట్టుకొస్తాడా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.