Hardik Pandya: ఆ క్రికెట‌ర్ ధ‌రించిన వాచ్ ధ‌ర అక్ష‌రాలా రూ. 5 కోట్లు..!

Hardik Pandya: సినిమా సెల‌బ్రిటీస్, క్రికెట‌ర్స్ కోట్ల రూపాయ‌లు సంపాదిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారు ధ‌రించే వ‌స్తువులు, లేదా వాడే వ‌స్తువులు చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. అయితే భార‌త క్రికెట‌ర్స్ మాత్ర‌మే చాలా ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విస్తుంటారు. మిగ‌తా దేశ క్రికెట‌ర్స్‌కి పెద్ద‌గా సంపాద‌న ఉండ‌దు. మ‌న క్రికెట‌ర్స్ అంద‌రు చాలా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుండ‌గా, ఆయ‌న ధ‌రించిన వాచ్ రేటు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క్రికెటర్ హార్ధిక్ పాండ్యా ప్రేమ వివాహం.. లగ్జరీ ఎంజాయ్ మెంట్ తో సరిగా రాణించడం లేదని.. జట్టులో చోటు కోల్పోయాడన్న టాక్ నడిచింది. ప్ర‌స్తుతం మ్యాచ్‌లు లేని క్ర‌మంలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అత‌ని లైఫ్ స్టైల్ చాలా రిచ్‌గా ఉంటుంది. టాప్-బిల్ లంబోర్ఘిని హురాకాన్ ఈవోవీ కారుపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతుంటాడు. లేదంటే మెర్సిడెస్ బెంజ్ కారుపై స్వారీ చేస్తుంటాడు.

ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌ని ధ‌రిస్తుంటాడు. చాలా రిచ్‌గా అత‌ని లైఫ్ సాగుతుంది. అయితే ఇటీవ‌ల హార్ధిక్ ఓ ఫొటో షేర్ చేయ‌గా, అందులో పటేక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినమ్ 5711 రిస్ట్ వాచ్ని ధరించాడు. దాని ధర ఏకంగా 5 కోట్ల రూపాయల ఉంటుంది. అంతటి ఖరీదైన వాచ్ ను పెట్టుకున్నాడంటే హార్ధిక్ ఎంతలా లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసుకోవచ్చు.

ఈ వాచ్‌ని ప్ర‌పంచంలో అత్యుత్తమ నాణ్యమైన ప్లాటినంతో తయారు చేయబడింది. ఇది ఆకుపచ్చ పచ్చలతో ఎంబ్రాయిడరీ చేయబడింది. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాణిజ్యపరంగా విక్రయించబడే గడియారాలలో ఒకటిగా చెబుతుంటారు.. హార్ధిక్ వ‌ద్ద పటెక్ ఫిలిప్ నాటిలస్ టైమ్ ట్రావెల్ వేరియంట్ కూడా ఉంది దీని ధర 2.2 కోట్లు. అతను కొన్ని ఇతర సూపర్ లగ్జరీ గడియారాలను కూడా కలిగి ఉన్నాడు .

వాచ్‌ల కోస‌మే హార్ధిక్ అంత ఖ‌ర్చు పెడుతున్నాడంటే అతని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు.త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ కోసం హార్ధిక్ సిద్ధ‌మ‌వుతున్నాడు. 5 సార్లు ఐపిఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు హార్ధిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.