Harbhajan Singh: కెమిస్ట్రీ అదుర్స్.. బిగ్ బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్ రచ్చ

Harbhajan Singh క్రికెటర్ హర్భజన్ సింగ్ నటుడిగా మారుతోన్న సంగతి తెలిసిందే. తమిళ తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతోన్న చిత్రంతో హర్భజన్ కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్నాడు. హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ లు ప్రధానపాత్రలుగా నటించిన చిత్రం ఫ్రెండ్ షిప్. సింగ్ అండ్ కింగ్ అనేది ట్యాగ్ లైన్. ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరించగా ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ బ్యూటీ, మాజీ ‘మిస్ శ్రీలంక’ ‘లోస్లియా‘ హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ నటిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగో ను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో ఆవిష్కరించగా 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం.

కెమిస్ట్రీ అదుర్స్.. బిగ్ బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్ రచ్చ

శాంతకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా నుంచి ‘లైఫ్ లో మజా కోసం’ అనే పాట విడుదలైంది. లహరి మ్యూజిక్ లో ఈ పాట విడుదల కాగా ఈ పాటను శరత్ సంతోష్ పాడారు. కాగా ఈ పాటకు మంచి స్పందన వస్తుంది. ఇక ఇందులో లోస్లియా హర్భజన్ సింగ్ కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది. మొత్తానికి బిగ్ బాస్ బ్యూటీ లోస్లియాతో హర్భజన్ ఫ్రెండ్ షిప్‌కు జనాలు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నారు.

Advertisement