Nayanthara : సరోగసీ వివాదాలు డోన్ట్ కేర్ : పిల్లలతో కలిసి నయనతార ‘దీపావళి’ శుభాకాంక్షలు.!
NQ Staff - October 25, 2022 / 09:33 AM IST

Nayanthara : సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. ఇటీవల సరోగసీ విధానంలో తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. కవలలు.. అందునా అబ్బాయిలిద్దరు జన్మించారు నయనతార దంపతులకి. పెళ్ళయి ఐదు నెలలు పూర్తవకుండానే, తల్లిదండ్రులవడమేంటి.? అంటూ పెద్దయెత్తున విమర్శలొస్తున్నాయ్.
ఇంకోపక్క నిబంధనలకు అనుగుణంగా నయనతార దంపతులు తల్లిదండ్రులయ్యారో లేదో తేల్చుతామంటూ తమిళనాడు మంత్రి ఒకరు వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన విఘ్నేష్, నయన్..
తమ పిల్లలిద్దరితో కలిసి నయనతార, విఘ్నేష్ శివన్.. తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. పిల్లల మొహాలు చూపించలేదుగానీ, విఘ్నేష్ శివన్ దీపావళి విషెస్ చెబుతోంటే, ఒక్కో పదాన్నీ అనుకరించింది. అంటే, పిల్లల ద్వారా విషెస్ చెప్పించినట్లు మనం అర్థం చేసుకోవాలన్నమాట.
ఇంతకీ, సరోగసీ వివాదంపై నయనతార – విఘ్నేష్ శివన్ ఏమనుకుంటున్నారు.? అసలు వివరణ ఇచ్చే ఉద్దేశ్యం వుందా.? లేదా.? ఏమో, వాళ్ళకే తెలియాలి. తమకు రిజిస్టర్ మ్యారేజ్ చాన్నాళ్ళ క్రితమే జరిగిందనీ, సంప్రదాయ బద్ధంగా వివాహం మాత్రమే ఇటీవల జరిగిందనీ.. రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగాక, నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ విధానం ఎంచుకున్నామని నయనతార దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి.