Happy Birthday Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బర్త్ డే స్పెషల్..

Happy Birthday Prabhas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ లో మాస్, కమర్షియల్ హీరోగా ఎదిగిన ప్రభాస్ విశేషాలేంటో తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రను దేశానికి పరిచయం చేస్తూ.. ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దేలా చేసిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. ప్రభాస్ కు ఈ క్రేజ్ అంత ఈజీగా రాలేదు. ఎంతో పట్టుదలతో అనుకున్నది సాధించేంత వరకు శ్రమించారు. ఎన్నో సమస్యల్ని దాటుకుంటూ కోట్లాది మంది డై హార్డ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు.

TheNewsQube-
Happy Birthday Prabhas Special Article
Happy Birthday Prabhas Special Article

ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసి ఎన్నో సినిమాల్లో తన టాలెంట్ ని నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన కెరీర్ ఖాతాలో వేసుకున్నారు. బుజ్జిగాడు, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, బాహుబలి లాంటి సినిమాలతో మరింత క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. అద్దిరిపోయే క్రేజ్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఏకైక టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు.

Happy Birthday Prabhas Special Article
Happy Birthday Prabhas Special Article

సాధారణ స్థాయి హీరో నుండి ఇంటర్నేషనల్ హీరోగా ఎదిగారు. ఈ క్రేజ్ ని బాహుబలి సినిమా అందించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఇండియన్ మార్కెట్ లోనే కాకుండా విదేశీ మార్కెట్ లో విపరీతమైన కలెక్షన్స్ ని దక్కించుకుంది. బాహుబలి 2 సినిమాతో ఇక తిరుగులేని హీరోగా మారారు. ప్రస్తుతం ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరో రేంజ్ లో సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే కావడం గమనార్హం.

Happy Birthday Prabhas Special Article
Happy Birthday Prabhas Special Article

అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ప్రస్తుతం ప్రభాస్ నటించే సినిమాల నుండి క్రేజీ అప్డేట్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాథేశ్యామ్ సినిమా టీజర్ ను గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న 3 డి సినిమా ఆదిపురుష్ లో శ్రీరాముని పాత్రగా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారు. దీనితో పాటు సలార్ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ విలక్షమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అయ్యారు.

పీరియాడిల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. విలక్షమైన పాత్రల్లో నటిస్తూ.. తన ఫ్యాన్స్ కోసం ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ లు చేయడంలో ప్రభాస్ కు ఆయనే సాటి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటించడానికి సిద్ధం అయ్యారు.

అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాకి ప్రభాస్ శ్రీకారం చుట్టారు. అంటే రానున్న రెండేళ్ళ కాలం వరకు ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటారన్నమాట. ఏది ఏమైనా ప్రభాస్ రేంజ్ మరింత పెరగాలని నెటిజన్లు, ప్రేక్షకులు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.