HANUMAN: హ‌నుమాన్ టైటిల్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ చిత్రం.. ఆస‌క్తిరేకెత్తిస్తున్న‌మోష‌న్ పోస్ట‌ర్

యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తీసిన ప్ర‌తి చిత్రంలోను కాస్త వైవిధ్య‌త‌ను చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. తొలి చిత్రం అ!తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ఈ సినిమా నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. అ! సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ .. కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు చేసారు. ఇవి కాన్సెప్ట్ పరంగా వైవిధ్యత‌ను చూపించాయి. ఇక ఈ రోజు ప్ర‌శాంత్ వ‌ర్మ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న నాలుగో సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.హ‌నుమాన్ టైటిల్‌తో ప్రశాంత్ వ‌ర్మ చిత్రం రూపొంద‌నుండ‌గా, ఈ సినిమా ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించింది.


హనుమాన్ భారతీయులకు సూపర్ హీరో ఫిగర్. ఆ టైటిల్‌తో చిత్రం అంటే ఇది ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో హిమాలయాల్లో అత్యద్భుతమైన లొకేషన్లను చూపించారు. నేపథ్య సంగీతం దైవిక అనుభూతిని కలిగించింది.పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చితంకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనున్నారు. అవెంజ‌ర్స్, డిసి- మార్వెల్ చిత్రాల‌కు భిన్నంగా ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న తాజా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.