Hansika Motwani : నాకు బట్టలు కూడా ఇవ్వకుండా అవమానించారు.. హన్సిక ఎమోషనల్..!
NQ Staff - June 11, 2023 / 12:53 PM IST

Hansika Motwani : హన్సిక ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె రీసెంట్ గానే సోహైల్ ఖతిరియాను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి బాగానే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్లు చేసింది. నాకు బాలీవుడ్ లో అవమానాలు చాలా ఎదురయ్యాయి.
అక్కడ నేను మొదట్లో సినిమాలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడి డిజైనర్స్ నన్ను చాలా అవమానించారు. నీకు మేము బట్టలు ఇవ్వమని ముఖానే చెప్పేశారు. వారికి మన సౌత్ హీరోయిన్స్ అంటే చాలా చులకన భావం ఉండేది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది.
అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. మనం వారికి సరైన బుద్ధి చెప్పాలని. అనుకున్నట్టుగానే కష్టపడి అవకాశాలు సాధించుకున్నాను. ఆ తర్వాత బాలీవుడ్ లోకి నేను వెళ్లినప్పుడు అదే డిజైనర్స్ ఇప్పుడు నన్ను వారు డిజైన్ చేసిన బట్టలు వేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఇవి వేసుకోవాలా అని ఒక నిముషం ఆలోచించాకే సరే అంటున్నాను.
కానీ ఇప్పటికీ నాకు డిజైనర్స్ విషయంలో కొంత అసహనం ఉంది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది హన్సిక. ఇలా ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ మీద ఇలాంటి ఆరోపణలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.