Shanmukh Jaswanth: ష‌ణ్ముఖ్‌ని హ‌మీదా అలా అనేసింది ఏంటి.. మీరే చూడాల‌ని ప్ర‌జ‌ల‌ను కూడా కోరింది..!

Shanmukh Jaswanth బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం 19 మంది సభ్యుల‌తో మొద‌లు కాగా, ఇప్ప‌టికే ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌజ్ లో 14 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే చివ‌రిగా ఎలిమినేట్ అయిన హ‌మీదా హౌజ్‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు తెలియ‌జేస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. శ్రీరామ్‌తో స్ట్రాంగ్ బాండింగ్ ఏర్ప‌డింద‌ని, అది ఎప్ప‌టికీ ఉంటుంద‌ని తెలియ‌జేసింది.

అలానే అనీ మాస్ట‌ర్ త‌ల్లిలా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. ఇక సిరి, ష‌ణ్ముఖ్‌,జ‌స్వంత్ క‌లిసి గేమ్ ఆడుతున్నారు. ష‌ణ్ముఖ్ టాస్క్‌ల‌లో పెద్ద‌గా పార్టిసిపేట్ చేయ‌డం లేదు. మీరు బ‌య‌ట ఉన్నారు. అత‌ను ఎలా ఆడుతున్నారో మీరే చూడండి. నేను కూడా చాలా సార్లు చెప్పాను గేమ్ ఆడండ‌ని, అతని పార్టిసిపేష‌న్ ఎక్క‌డా పెద్ద‌గా లేద‌ని పేర్కొంది హ‌మీదా.

బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక వేదిక‌పై నుండి ప‌లువురు మంచి చెడులు చెప్పింది హ‌మీద‌. మానస్ మంచోడే కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత కాజల్ ఫేక్ అంటూ కుండబద్దలు కొట్టింది. ఆమె బంధాలకు అస్సలు విలువ ఇవ్వదని పేర్కింది. సిరి ఫ్లిప్ అని.. మొదట్లో బాగానే ఉండేదని.. కానీ మధ్యలో మారిపోయిందని చెప్పుకొచ్చింది.

షన్ను సైతం ఫ్లిప్ అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియాంక ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదని.. ఆమెకు నిజాంగానే ప్రేమ ఉందా ? లేదా ? అలా ఊరికే చూపిస్తుందా ? అర్థంకాదని చెప్పింది. ఇక ప్రియ తన ఫెవరేట్ అని.. కానీ తను కెప్టెన్ కాకుండా చేశాను అనే గిల్టీ ఫీలింగ్ ఉందని.. కానీ వారంలో పోయిందని చెప్పుకొచ్చింది. యానీ మాస్టర్ తన ఫెవరేట్ అని.. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తుంటాను.

సన్నీ..ఎప్పుడూ నవ్విస్తుంటాడు ,చాలా మంచివాడని తెలిపింది. ఇక శ్వేత కూడా చాలా మంచిదని చెప్పుకొచ్చింది. రవి తనకు అన్నయ్య అని.. ఇక విశ్వ ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు.. తెలియకుండా మాట్లాడితే.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకోలేం.. లోబో, శ్రీరామ్ మంచివాళ్లని చెప్పుకొచ్చింది హ‌మీద‌.