Biggboss 5: హమీదా ఐదు వారాల‌కి గాను ఎంత రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుందో తెలుసా?

Biggboss 5: న‌వ‌రాత్రి రోజు దాదాపు నాలుగు గంట‌ల పాటు బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సాగిన విష‌యం తెలిసిందే. పండగ సందర్భంగా రెండు రోజులు ఏ గొడవ లేకుండా బిగ్ బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా మారిపోయింది. కానీ అన్నింటి మధ్యలో ఎలిమినేషన్ కూడా జరిగింది. ఊహించిన‌ట్టుగానే హ‌మీదాని హౌజ్ నుండి బ‌య‌ట‌కు పంపారు. ఐదు వారాలు హౌజ్‌లో ఉండి తెగ సందడి చేస‌ని హ‌మీదా స‌డెన్‌గాబ‌య‌ట‌కు రావ‌డం ఎవ‌రికి న‌చ్చ‌లేదు.

Hamida Remuneration for Five weeks in Biggboss 5
Hamida Remuneration for Five weeks in Biggboss 5

బిగ్ బాస్ హౌస్‌లోకి రాగానే హ‌మీదా పేరు ఫేమస్ అయిపోయింది. హౌస్‌లో గ్లామర్‌ను యాడ్ చేస్తూ, టాస్క్‌లలో తన వల్ల అయిన బెస్ట్‌ను అందిస్తూ హమీదా ఎప్పుడూ ప్రేక్షకులను అలరించడానికే ప్రయత్నించేది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ కట్టిపడేసి ఎంతోమంది అబ్బాయిలకు క్రష్‌గా మారిపోయింది హమీదా.

వీరిద్దరు లవ్ బర్డ్స్ అంటూ ప్రేక్షకులు వదంతులు కూడా మొదలుపెట్టేసారు. అయితే హమీదా ఎలిమినేట్ అవ్వడం తట్టుకోలేని శ్రీరామ్ తనను పట్టుకుని బాగా ఏడ్చేసాడు. కానీ హమీదా మాత్రం తాను చాలా తృప్తిగానే హౌస్ నుండి వెళ్తున్నట్టు చెప్పింది. సోషల్‌ మీడియాలో సరైన ఫ్యాన్‌బేస్‌ లేకపోవడంతోనే ఆమె ఓటింగ్‌లో వెనకబడిపోయిందంటున్నారు నెటిజన్లు. శ్రీరామ్‌తో నడుపుతున్న లవ్‌ ట్రాక్‌తో ఆమెకు కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ దొరికినప్పటికీ అందరికన్నా తక్కువ ఓట్లు పడటంతో ఎలిమినేట్‌ అవక తప్పలేదు.

ఆమె హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన సందర్భంగా హమీదా పారితోషికం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె ఒక్క వారానికిగానూ 80 వేల నుంచి లక్ష రూపాయల మేర రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ లెక్కన ఆమె ఐదువారాలకుగానూ నాలుగున్నర లక్షల పై చిలుకే వెనకేసుకుంది. కాగా గతవారం ఎలిమినేట్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌ కూడా వారానికి లక్ష అందుకున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.