Hamida: శ్రీరామ్‌తో రిలేష‌న్‌షిప్‌పై నోరు విప్పిన హ‌మీదా

Hamida: ప్ర‌తి సీజ‌న్‌లో కొన్ని రొమాంటిక్ క‌పుల్స్ ఉంటాయి. వీరు చేసే సంద‌డి మాములుగా ఉండదు. సీజ‌న్ 5కి గాను శ్రీరామ్ చంద్ర‌, హ‌మీదా రొమాంటిక్ క‌పుల్‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అయితే వీరి రిలేష‌న్ మ‌రింత స్ట్రాంగ్ కాకుండా బిగ్ బాస్ అడ్డుక‌ట్ట వేశాడు.ఐదో వారంలో ఆమెని ఎలిమినేట్ చేశాడు . ఆమె లేని లోటు అందరికన్నా ఎక్కువగా శ్రీరామ్‌ను వెంటాడుతుంది.

నిరంతంరం అతడినే అంటిపెట్టుకుని ఉంటూ అటు పనుల్లోనూ, ఇటు టాస్కుల్లోనూ శ్రీరామ్‌ చేయి విడవలేదు హమీదా. అలాంటిది సడన్‌గా అతడికి దూరం కావాల్సిరావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. బిగ్‌బాస్‌ హౌస్‌కు గుడ్‌బై చెప్పేముందు శ్రీరామ్‌ను కళ్లారా చూసుకుని మనసారా ఏడ్చేసింది. ఇప్ప‌టికీ శ్రీరామ్‌ని త‌ల‌చుకొని కాస్త ఎమోష‌న‌ల్ అవుతుంది.

బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వచ్చాక హ‌మీదాకు ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుండ‌గా, అందులో ముఖ్య‌మైన విష‌యం శ్రీరామ్‌తో రిలేష‌న్‌. దానిపై తాజాగా స్పందించిన హ‌మీదా.. అది ప్రేమ‌,దోమ లాంటివి కాకుండా స్ట్రాంగ్ కనెక్ష‌న్. అనీ మాస్ట‌ర్‌లో అమ్మ‌ని చూసుకున్నా. ర‌విలో అన్న‌య్య‌ని చూసుకున్నా.శ్రీరామ్‌తో ఓ మంచి రిలేష‌న్ ఏర్ప‌డింది.

హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా మా ఇద్ద‌రి మధ్య రిలేష‌న్ అలానే ఉంటుంది. అది హార్ట్ లో నుండి వ‌చ్చింది, అందుకే స్ట్రాంగ్‌గా ఉంటుంది అని హ‌మీదా పేర్కొంది.ఇంట్లో ఉన్న వారిలో ఫ్యాన్ బేస్ తక్కువగా ఉండడంతో పాటు గేమ్ ఆడడం కన్నా శ్రీరామ్ వెనకపడడడం మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న కారణంగానే హమీదా ఎలిమినేషన్ జరిగిపోయింది.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నందుకు గాను హమీదా ఒక్క వారానికి 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ లెక్కన ఆమె ఐదు వారాలకు గానూ మొత్తం నాలుగున్నర లక్షలకు పైగానే తీసుకుని వెళ్ళి ఉంటుందని చెప్తున్నారు.