Tarzan: విమాన ప్ర‌మాదంలో ప్ర‌ముఖ న‌టుడు మృతి.. షాక్‌లో అభిమానులు

గ‌త ఏడాది నుండి సెల‌బ్రిటీలు వ‌రుస మ‌ర‌ణాలు చెందుతున్నారు. కార‌ణం ఏదేతైనేమి కాని చాలా మంది లెజండ‌రీ స్టార్స్ క‌న్నుమూసారు. ఈ ఏడాది కూడా ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మంది ప్ర‌ముఖుల‌ని కోల్పోయాం. తాజాగా య‌అమెరికా టీవీ న‌టుడు జో లారాతో పాటు ఆయ‌న భార్య‌, మొత్తం ఏడు మంది కుటుంబ‌స‌భ్యులు దుర‌దృష్ట‌క‌ర‌రీతిలో విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. వారి మృతి అభిమానుల‌కు విషాదాన్ని మిగిల్చింది. అనుకోని రీతిలో ఇంత పెద్ద స్టార్ మ‌ర‌ణించ‌డం ప‌ట్ల ఇండ‌స్ట్రీలోను విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

వివ‌రాల‌లోకి వెళితే న‌టుడు జో లారాతో పాటు ఆయ‌న ఫ్యామిలీ అంతా చిన్న‌పాటి బిజినెస్ జెట్ విమానంలో టెన్నిస్సీ ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరారు. స్టార్ట్ అయిన కొద్దిసేప‌టికి స‌మీపంలో ఉన్న స‌రస్సు వ‌ద్ద ఆ విమానం కూలిపోయింది. ప్రమాద స‌మ‌యంలో విమానంలో మొత్తం ఏడు మంది ఉన్నారు. న‌టుడు జో లార్‌తో పాటు ఆయ‌న భార్య గ్వెన్ షాంబ్లిన్ లారా ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్ త‌ర్వాత నాష్‌విల్లీ వ‌ద్ద ఉన్న పెర్సీ ప్రీస్ట్ లేక్‌లో కుప్పకూలింది. అందులో ఉన్న‌వారంతా మ‌ర‌ణించిన‌ట్లు ఫెడ‌ర‌ల్ విమాన‌శాఖ తెలిపింది. 1980, 1990 ద‌శ‌కంలో అమెరికా టీవీ సిరీస్‌లో ప్ర‌సారం అయ్యిన టార్జ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ది.డైట్ గురూగా న‌టుడి భార్య‌ చాలా ఫేమ‌స్. టార్జ‌న్‌-ద ఎపిక్ అడ్వెంచ‌ర్స్ సిరీస్‌లోనూ టార్జ‌న్ పాత్ర పోషించాడు. ఈ సిరీస్ రెండేళ్ల పాటు కొన‌సాగింది.