Shakuntalam : శాకుంతలం వీఎఫ్ఎక్స్ గురించి గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
NQ Staff - January 9, 2023 / 04:06 PM IST

Shakuntalam : గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత మరియు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన శాకుంతలం సినిమా ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ఉన్న ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ లో దిల్ రాజు భాగస్వామిగా ఉన్నాడు. తాజాగా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి.
శాకుంతలం సినిమాను ఒక విజువల్ వండర్ అన్నట్లుగా దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు అంటూ ట్రైలర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా ఎమోషనల్ అయ్యాడు.
ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం సంవత్సర కాలం.. షూటింగ్ కార్యక్రమాల కోసం ఆరు నెలలు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఏడాదిన్నర సమయం తీసుకున్నట్లుగా గుణశేఖర్ పేర్కొన్నారు. మొత్తం మూడు సంవత్సరాల కాలంను దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా కోసం వ్యచ్చించడం జరిగింది.
శాకుంతలం సినిమా లోని విజువల్స్ ను చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో తెలుగు లో వచ్చిన సినిమాలను మించిన విజువల్ వండర్ అన్నట్లుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. సమంత అందంతో పాటు అందమైన విజువల్స్ తో సినిమాను రూపొందించిన గుణశేఖర్ దర్శకుడిగా ఇప్పటికే సఫలం అయ్యాడు. ముందు ముందు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.