Jabardasth Show : జ‌బ‌ర్ధ‌స్త్‌లో పాల్గొనాల‌ని అనుకునే వాళ్లకు గొప్ప ఛాన్స్.. అదిరి అభి టిప్స్ వినండి!

Jabardasth Show: ప్ర‌స్తుతం బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందిస్తున్న కార్య‌క్ర‌మాల‌లో జ‌బ‌ర్ధ‌స్త్ ఒక‌టి. ఈ షోతో చాలా మంది లైఫ్ సెటిల్ అయింది. ఇప్ప‌టికీ చాలా మంది టాలెంట్ ఉన్నవారు ఆఫ‌ర్స్ లేక స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. అయితే జ‌బర్ధ‌స్త్ షోతో బుల్లితెరను శాసిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు.

Jabardasth Show
Jabardasth Show

జబర్దస్త్ షో ఎంతోమంది నటీనటులకు ఈ వేదిక ఒక వరంలా మారింది. ఎంతోమంది జబర్దస్త్ షోలో తమ టాలెంట్ చూపించాలని వేచి చూస్తున్నారు. అయితే అక్కడ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వరని.. ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన వాళ్లను మాత్రమే తీసుకువచ్చి పెడుతున్నారు అంటూ కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫేస్ బుక్ లో పరిచయమైన ఆదిని తీసుకొచ్చి బ్రేక్ ఇచ్చి ఈ రోజు హైపర్ ఆదిగా మార్చేశాడు అదిరే అభి.

ఈ క్ర‌మంలోనే అదిరే అభి సోష‌ల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన త‌మ‌కు ఆఫ‌ర్ ఇవ్వాల‌ని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ షోలో పార్టిసిపేట్ చేయాల‌నుకునే వాళ్ల కోసం అదిరే అభి గుడ్ న్యూస్ చెప్పాడు. అవకాశం మేము ఇవ్వడం కాదు.. మీ ముందే మీకు బంగారం లాంటి అవకాశం వచ్చింది.. ప్రస్తుతం జబర్దస్త్ ఆడిషన్స్ జరుగుతున్నాయి.. అందులో మీ టాలెంట్ చూపించి సగర్వంగా జబర్దస్త్ స్టేజీపై అడుగుపెట్టమని ఒక వీడియో విడుదల చేసాడు అభి.

జ‌బ‌ర్ధ‌స్త్ ఆడిష‌న్‌లో పాల్గొనే వాళ్లు సినిమా డైలాగ్స్ లేదంటే ఆల్‌రెడీ షోస్ లో చేసిన‌వి కాకుండా కొత్త‌గా ట్రై చేసి వీడయోని రూపొందించాల‌ని అభి టిప్స్ ఇచ్చాడు. ఫేస్ వ‌ర‌కే కాకుండా బాడీ లాంగ్వేజ్ క‌వ‌ర్ అయ్యేలా వీడియో చేయాల‌ని అన్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2 నిమిషాల్లో మీ టాలెంట్ మొత్తం చూపించి ఒక అద్భుతమైన ఆడిషన్ చేసి జబర్దస్త్ కి పంపించండి.. మీరు కూడా ఇక్కడ స్టార్స్ అయిపోవచ్చు అంటున్నాడు. మల్లెమాల ప్రొడక్షన్స్ ఇటీవ‌ల ప‌ర్‌ఫార్మెన్స్ స‌రిగా లేని వారిని జ‌బ‌ర్ధ‌స్త్ నుండి తొలగించిన సంగ‌తి తెలిసిందే.