NIDHHI AGERWAL: అందాల ‘నిధి’కి గుడి .. పాలాభిషేకాలు,పూజ‌లు చేస్తూ అభిమానం చాటుకుంటున్న ఫ్యాన్స్

Samsthi 2210 - February 15, 2021 / 11:14 AM IST

NIDHHI AGERWAL: అందాల ‘నిధి’కి గుడి .. పాలాభిషేకాలు,పూజ‌లు చేస్తూ అభిమానం చాటుకుంటున్న ఫ్యాన్స్

NIDHHI AGERWAL బ్ర‌తికున్న మ‌నిషికి గుడి క‌ట్టి పూజ‌లు చేస్తున్నారంటే వారిపై అభిమానుల‌లో ఎంతటి ప్రేమ ఉండి ఉంటుంది. ఇలాంటి అదృష్టం కొంద‌రికే ద‌క్కుతుంది. అయితే అభిమాన స్టార్స్‌కు గుడులు క‌ట్టే సంప్ర‌దాయం చాలా ఏళ్ళు నుండే ఉన్న‌ప్ప‌టికీ, ఈ మ‌ధ్య అంత‌గా క‌నిపించ‌డం లేదు.ఇటీవ‌ల బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌కు సిద్ధిపిటే జిల్లాలోని దుబ్బ‌తండాలో గుడి క‌ట్టి పూజ‌లు చేశారు. ఆయ‌న లాక్ డౌన్ సమ‌యంలో చేసిన సేవ‌ల‌కు గాను వీరు గుడి క‌ట్టారు. కాని నిధి అగ‌ర్వాల్‌కు గుడి క‌ట్టి పూజలు చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

నిధి అగ‌ర్వాల్‌.. మున్నా మైఖేల్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో నాగ చైత‌న్య స‌ర‌స‌న స‌వ్య‌సాచి అనే చిత్రం చేసింది. ఇది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఆ తర్వాత‌ అఖిల్‌తో మిస్ట‌ర్ మ‌జ్ను అనే చిత్రం చేసింది. అది కూడా నిరాశ ప‌రిచింది. ఇక ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో రామ్ స‌ర‌స‌న సెకండ్ హీరోయిన్‌గా న‌టించిన‌ప్ప‌టికీ, నిధికు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమాతో నిధి రేంజ్ మారిపోయింది. ఆమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.ఇక సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌కు సంబంధించిన ప‌లు ఫొటోలు షేర్ చేస్తూ కూడా నిధి అగ‌ర్వాల్ త‌న ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది.

ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అశోక్ గ‌ల్లా స‌ర‌స‌న తెలుగులో ఓ చిత్రం చేస్తుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోను న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా నిధి అగర్వాల్‌ అభిమానులు త‌మ‌ అభిమాన నటికి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. ఆ విగ్ర‌హానికి పాలాభిషేకం చేశారు. కేక్ క‌ట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, ఇవి చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కోలీవుడ్ జ‌నాల ప్రేమ‌ను ఇంత‌లా గెలిచేంత నిధి ఏం చేసిందా అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ విష‌యంపై నిధి అగ‌ర్వాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us