Theaters: థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమ‌తినిచ్చిన ప్రభుత్వం

Theaters: థియేటర్స్ తెరవడం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. గతేడాది ఏడు నెలలకు పైగానే థియేటర్స్ పూర్తిగా క్లోజ్ చేసారు. ఆ సమయంలో ఎంతోమంది థియేటర్ యాజమాన్యం రోడ్డున పడ్డారు. కొన్ని వందల థియేటర్స్ కళ్యాణ మంటపాలుగా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 200 థియేటర్స్ శాశ్వతంగా మూసేసారు. జనవరి నుంచి టైమ్ బాగుంది.. మార్చి నాటికి అంతా సెట్ అయింది.. ఇంక ఎప్రిల్ నుంచి వరసగా సినిమాలు వస్తున్నాయి పండగ చేసుకోవచ్చు అనుకుంటున్న తరుణంలో మరోసారి కోవిడ్ వచ్చేసింది. సెకండ్ వేవ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఇండియాపై కన్నెర్ర జేసింది. దాంతో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న థియేటర్స్ వ్యవస్థపై మరోసారి కోలుకోలేని దెబ్బ పడిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో ఇవి ఓపెన్ కావడం కలగానే కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర సర్కార్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

Cinema Theatersథియేటర్స్ తెరుచుకోడానికి అక్కడ అనుమతులు వచ్చేసాయి. జూన్ 7 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ అక్కడ సర్కార్ అనుమతులు ఇచ్చేసింది. అయితే అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ తెరిచినా కూడా ప్రేక్షకులు వస్తారా అనేది అనుమానమే. ఎందుకంటే దేశంలో వచ్చే కేసుల్లో 30 శాతం ముంబై నుంచే వస్తున్నాయి. మహారాష్ట్రలో అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ సమయంలో థియేటర్స్ వరకు ప్రేక్షకులు వచ్చేది డౌట్ ఫుల్ గానే ఉంది. మరోవైపు థియేటర్స్ తెరిచినా సినిమాలు మాత్రం రావడం లేదు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం పూర్తి అయ్యాకే థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చూస్తున్నట్లు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు.

Cinema Theaters

పరిస్థితులు కూడా అప్పటి వరకు కాస్త చల్లబడతాయని.. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు థియేటర్స్ మూసి ఉంచడమే నయమని ప్రభుత్వాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే కనక థియేటర్స్ మరికొన్ని నెలల వరకు కూడా తెరుచుకోవడం కష్టమే అవుతుంది. అలాంటప్పుడు మరోసారి ఎగ్జిబిటర్లకు నరకమే. మరోవైపు చాలా సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితులు అదుపులోకి వస్తే వాటిని విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి రావడం గగనంగానే కనిపిస్తుంది. దాంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడటం తప్ప ఇప్పుడు మరే దారి కూడా కనిపించడం లేదు.