SREEMUKHI: శ్రీముఖి పెళ్లి.. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

SREEMUKHI బుల్లితెర ‌పై పసందైన వినోదం అందించే బెస్ట్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ప‌టాస్ కార్య‌క్ర‌మంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన శ్రీముఖి బుల్లితెర‌ని షేక్ చేస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా మెరుస్తుంటుంది. బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్యక్రమంలో పాల్గొన్న శ్రీముఖి ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఫైన‌ల్ వ‌ర‌కు చేరింది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన కూడా ఈ అమ్మ‌డికి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. అయితే ఈ అమ్మ‌డి పెళ్లి టాపిక్ కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా శ్రీముఖి పెళ్లి విష‌యం పై ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. . ముంబైకి చెందిన వ్య‌క్తిని శ్రీముఖి పెళ్లి చేసుకోనుంద‌ని, అతి త్వ‌ర‌లోనే ఈ అమ్మ‌డి వివాహం జ‌ర‌ప‌నున్నార‌ని టాక్. తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి రాక‌ముందు శ్రీముఖి ముంబైలో ట్ర‌య‌ల్స్ వేయ‌గా, అప్పుడు ఓ వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. ఇప్పుడు అతనితోనే ఏడ‌డుగులు వేసేందుకు శ్రీముఖి సిద్ధంగా ఉంద‌ని టాక్. పెళ్లికి కొద్ది రోజులు స‌మ‌యం తీసుకోవాల‌ని శ్రీముఖి భావిస్తున్న‌ప్ప‌టికీ, తల్లిదండ్రుల పోరు భరించలేక పెళ్ళి చేసుకోవడానికి సిద్దమైంద‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. కాగా, బిగ్ బాస్‌లో ఉన్నపుడు తాను ఒకర్ని ప్రేమించి మోసపోయానని శ్రీముఖి చెప్పిన విష‌యం విదిత‌మే.

Advertisement