Gopichand : గోపీచంద్ రెండు నెలల వరకు ఆగాల్సిందే..సీటీమార్ రిలీజ్ వాయిదా వేసి రాంగ్ స్టెప్ వేశారా..?

Gopichand : గోపీచంద్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులవుతోంది. గౌతం నంద సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సినిమా రాకపోవడంతో ప్రస్తుతం తెరకెక్కిన సీటిమార్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఆంధ్రా జట్టుకు గోపీచంద్..తెలంగాణ జట్టుకు తమన్నా కోచ్‌లుగా కనిపించబోతున్నారు. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు.

gopichand-need to wait for two months
gopichand-need to wait for two months

ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి జ్వాలా రెడ్డి, పెప్సీ ఆంటీ సాంగ్స్ ని రిలీజ్ చేసి సినిమా మీద భారీగా అంచనాలు పెంచారు. ప్రేక్షకుల్లో కూడా సినిమా మీద బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ కి వైల్డ్ డాగ్ టీమ్ షాకిచ్చింది. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దాంతో సీటిమార్ చిత్ర బృందం తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు.

Gopichand : రెండు వారాల గ్యాప్ చూసుకొని సీటీమార్ సినిమాని రిలీజ్ చేస్తారేమో.

ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అధికారకంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు సీటీమార్ సినిమాకి పెద్ద సమస్యే వచ్చింది. మరో రెండు నెలల వరకు సీటీమార్ సినిమాకి సోలో డేట్ దొరకడం కష్టం అంటున్నారు. మరి ఈ రెండు నెలల్లో సీటీమార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న ఆతృత అభిమానుల్లో ఉంది. కొందరేమో అనవసరంగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి ఏదైనా రెండు వారాల గ్యాప్ చూసుకొని సీటీమార్ సినిమాని రిలీజ్ చేస్తారేమో.

Advertisement