VAKEEL SAAB: వకీల్ సాబ్‌కి సుప్రీం కోర్టు జడ్జిసాబ్ కితాబు.. ఆనందంలో చిత్ర బృందం
Priyanka - April 20, 2021 / 05:20 PM IST

పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే .2016లో విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరామ్ వేణు చిత్రాన్ని తెరకెక్కించగా ఇందులో శృతి హాసన్ , ప్రకాశ్ రాజ్, అంజలి, అనన్య, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు, బోనీ కపూర్ చిత్రాన్ని నిర్మించారు. లాయర్‌గా పవన్ కళ్యాణ్ తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. సినిమాపై చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్స్ ప్రశంసలు కురిపించారు.
ఇప్పుడు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాను సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ కొనియాడారు.వకీల్ సాబ్ లో పవన్ నటన అద్భుతం అని అలాగే పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు ఇలాంటి సినిమా చెయ్యరు . కానీ పవన్ ఈ సినిమాను చేసి నటించడం కాదు జీవించేశారని ప్రశంసించారు. ఇన్నాళ్లకి వకీల్ సాబ్ చిత్రంతో మధ్య తరగతి మహిళలపై జరుగుతున్న అరాచకాలపై న్యాయపోరాటం ఓ చిత్రంగా వచ్చింది.ఈ చిత్రాన్ని దేశంలోనే అగ్రనటులే కాదు ప్రపంచ స్థాయి నటులు కూడా మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.