Sekhar Master: 2003 జూలై 8న శేఖ‌ర్ మాస్ట‌ర్‌ని చంపేసిన గూగుల్‌

Sekhar Master: ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఇటీవ‌లి కాలంలో అనేక ప్రాబ్ల‌మ్స్‌ని ఫేస్ చేస్తుంది. కొన్ని విష‌యాల‌లో త‌ప్పుడు స‌మాచారం అందిస్తూ నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతుంది. ఒక‌రి పేరుకి బ‌దులు మ‌రొక‌రి పేరు పెట్ట‌డం లేదంటే వివ‌రాలు పూర్తిగా మార్చ‌డం, ఏదైన కీ వ‌ర్డ్ టైప్ చేస్తే దానికి వేరే అర్ధం వ‌చ్చేలా స‌మాచారం రావ‌డం కొంత ఇబ్బంది పెడుతుంది.

Google Shows Shekar Master Died in 2003
Google Shows Shekar Master Died in 2003

ఇటీవ‌ల ఇండియాలో చెత్త భాష ఏది అని గూగుట్‌లో టైప్ చేస్తే కన్న‌డ భాష అని ప్ర‌త్య‌క్షం అయింది.దీంతో క‌న్న‌డ భామ ప్ర‌ణీత‌తో పాటు ప‌లువురు క‌న్న‌డీగులు మండిప‌డ్డారు. దీంతో గూగుల్ త‌న త‌ప్పుని స‌రి చేసుకుంది. ఇక తాజాగా పాపుల‌ర్ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ చ‌నిపోయిన‌ట్టు చూపించ‌డంతో గూగుల్‌పై అభిమానులు, శేఖ‌ర్ స‌న్నిహితులు మండిప‌డుతున్నారు.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో చాలా ఫేమ‌స్ . సినిమాల‌కు ప‌ని చేస్తూనే ఆయ‌న బుల్లితెర‌పై జ‌డ్జిగా సంద‌డి చేస్తున్నాడు. ఢీ డ్యాన్స్ షో సీజ‌న్ 7 నుండి 13 వ‌ర‌కు ఆయ‌న జడ్జిగా వ్య‌వ‌హ‌రించారు. అలానే ప‌లు స్పెష‌ల్ షోల‌లో కూడా శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జిగా క‌నిపిస్తుంటారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఏ కొరియోగ్రాఫ‌ర్‌కి లేని క్రేజ్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌కి ఉంది.

Google Shows Shekar Master Died in 2003
Google Shows Shekar Master Died in 2003

తాజాగా ఆయ‌న‌కు గూగుల్ షాకిచ్చింది. గూగుల్ లో శేఖర్‌ మాస్టర్‌ అని సెర్చ్‌ చేస్తే.. ఆయన ఫోటోతో పాటు పుట్టిన రోజు 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తుంది. ఇది చూసి శేఖర్ అభిమానులు అవాక్కయ్యారు. ఇది ఎలా జ‌రిగింద‌ని ఆరా తీస్తే త‌మిళ‌నాడుకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ జీవీ శేఖ‌ర్‌ని అంద‌రు మాస్ట‌ర్ శేఖ‌ర్ అని పిలిచేవారు.దాదాపు 50కి పైగా సినిమాల‌లో న‌టించిన ఆయ‌న జూలై 8,2003లో చ‌నిపోయారు.

అయితే వికీపీడియాలో గూగుల్‌ పొరపాటున కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఫోటోని అప్‌లోడ్‌ చేసింది. గూగుల్‌ చేసిన తప్పు పట్ల శేఖర్‌ మాస్టర్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ద‌య‌చేసి ఇలాంటి త‌ప్పులు మ‌ర‌మ‌ర‌లా చేసి మా ఆగ్ర‌హానికి గురి కావొద్ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.