Kaushal: కౌశ‌ల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్షేమంగా ఇండియాకు చేరుకున్న ఆయ‌న సతీమ‌ణి

Kaushal: బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం విన్న‌ర్ కౌశ‌ల్ త‌ర‌చు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. ఆయ‌న బిగ్ బాస్ షో ద్వారా ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో ‘కౌశల్‌ ఆర్మీ’ అనే గ్రూప్ కూడా స్థాపించారు అభిమానులు. అయితే ఇటీల కౌశ‌ల్ తన భార్య నీలిమ ఆరోగ్యానికి సంబంధించి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఏదో సాధించేందుకు బ‌య‌ల్దేరావు. ఏదో ఒక‌టి చేసేందుకు నువ్వు జీవితంలో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో అది సాధిస్తావు అని నాకు తెలుసు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భావిస్తున్నాను. నువ్వు క‌న్న క‌ల‌ల కోసం పోరాడిరా అంటూ ఎమోష‌నల్ పోస్ట్ పెట్టారు. దీంతో నీలిమకి ఏమైంది? కౌశల్ ఎందుకు ఈ పోస్ట్ పెట్టాడని అభిమానులు ఆందోళన చెందారు.

Kaushal Manda

కొద్ది రోజుల త‌ర్వాత నీలిమ త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో విడుద‌ల చేస్తూ.. యూకేలా జాబ్ చేస్తున్న స‌మ‌యంలో నేను కోవిడ్ బారిన ప‌డ్డాను. నాకు కోవిడ్ వచ్చిన తరువాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది.. చెస్ట్ మొత్తం పెయిన్.. ఆయాసం ఎక్కువగా వచ్చేసేది. ఆ టైంలో నేను ఎన్ హెచ్ ఎస్ వాళ్లకి చెప్పాను. నాకు ప్రాబ్లమ్‌గా ఉంది చూడండి అని. కానీ వాళ్లు పారాసిటిమాల్ ప్రతి ఆరు గంటలకి ఒకసారి చొప్పున 1000 ఎంజీ వాడండి అని మాత్రమే చెప్పారు తప్పితే.. ఇంకేం వైద్యం చేయలేదు. ఇండియాలో చిన్న ప్రాబ్లమ్ ఉందని చెప్పినా ఎంతో బాగా స్పందిస్తారు. ట్రీట్ మెంట్ వెరీ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్. దేవుడి దయవల్ల నాకు సెట్ అయ్యింది. ట్రీట్ మెంట్ అయితే ఏం లేదు. ఒక రకంగా ఇండియా చాలా బెటర్. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు.. ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇక్కడ లేరని కాదు కానీ.. సిస్టమ్ ఫాలో అవ్వమంటున్నారు. మెడిసిన్ ఇవ్వడం లేదు.. కోవిడ్‌కి అయితే పారాసిటిమల్ మాత్రమే ఇస్తున్నారు. అది తప్ప ఇంకేం లేదు అని నీలిమ చెప్పుకొచ్చింది.

Kaushal Manda

తాజాగా నీలిమ కరోనా నుంచి కోలుకోగా, కోవిడ్‌ వచ్చిన 8వ రోజే తనకు నెగిటివ్‌ రావడంతో నీలిమ వెంట‌నే ఇండియాకు వ‌చ్చేసింది. నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌( NHS )నుంచి తనకు సర్టిఫికెట్ ఇవ్వ‌డంతో నీలిమ భారత్‌కు చేరుకుంది. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు..జై పారాసిటమాల్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు కౌశ‌ల్. మ‌రో వైపు తన కోసం ప్రార్ధ‌న‌లు చేసిన వారికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది నీలిమ‌. ప్ర‌స్తుతం కౌశ‌ల్ త‌న ఫ్యామిలీతో క‌లిసి లేటెస్ట్‌గా దిగిన ఫొటో వైరల్ అవుతుంది.