Bangarraju : గుడ్‌న్యూస్ చెప్పిన బంగార్రాజు..!

Bangarraju : అక్కినేని నాగార్జున బంగార్రాజుగా నటించిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’. బంగార్రాజుగా అందరి మెప్పును పొందారు. ఈ సినిమాని కళ్యాణ్ కృష్ణ
దర్శకత్వం వహించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ గా బంగార్రాజు అనే టైటిల్ తో మన ముందుకు రాబోతున్నారు కింగ్ నాగార్జున అక్కినేని. 60 ఏళ్ళ వయసులో కూడా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అటూ సీనియర్ హీరోస్ కి ఇటూ యంగ్ హీరోస్ కి టఫ్ కాంపిటిషన్ ఇస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా మారారు. తన కొడుకులైన నాగ చైతన్య – అఖిల్ లకు కూడా పోటీగా నిలిచారని చెప్పొచ్చు. తన కెరీర్ ని మాత్రమే చూసుకోకుండా ఇద్దరు కొడుకుల కెరీర్ కి సంబంధించి సలహాలను, సూచనలను ఇస్తూ సక్సస్ఫుల్ హీరోగానే కాకుండా నిర్మాతగా బిజినెస్ పర్సన్ గా ఎన్నో
విజయాలను సాధిస్తున్నారు.

good-news-by-bangarraju...!
good-news-by-bangarraju…!

‘వైల్డ్ డాగ్’ నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూ మనం సినిమా గురించి ప్రస్తావించారు. తన తండ్రి అయిన అక్కినేని నాగేశ్వర రావు, నాగ చైతన్య, అఖిల్ లతో ‘మనం’ సినిమా ద్వారా స్క్రీన్ పంచుకోవడం మరపురాని అనుభవం అని చెప్పకనే చెప్పారు. అలాగే ఇప్పుడు ‘బంగార్రాజు’ సినిమాలో నాగ చైతన్య తో కలిసి నటించబోతున్నట్లు, త్వరలోనే అఖిల్ తో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ లో పాల్గోనబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ వర్క్ చూసుకోవడం లో బిజీగా ఉండటం వల్ల అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరించడం వల్ల అఖిల్ తో చేయబోయే సినిమా గురించి ఎలాంటి ప్రకటన అధికారకంగా వెల్లడించడం లేదని తెలుస్తుంది.

Bangarraju : నాగ్ అఖిల్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా…!

అయితే నాగ్ అఖిల్ కాంబోలో రాబోయే సినిమా గురించి త్వరలోనే అధికారికంగా వచ్చే ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ఆ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ్ ‘పీఎస్వీ గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాతో బిజీగా ఉండగా అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజి బిజీగా ఉన్నాడు. ఇదే కాకుండా ‘ఏజెంట్’ అనే సినిమా లో కూడా చేస్తున్నాడు. అందువల్ల నాగర్జున అఖిల్ కాంబినేషన్ లో సినిమా రావడానికి కొంత సమయం పడుతుందనే అనిపిస్తుంది. మల్టీస్టారర్ హావా నడుస్తున్న తరుణంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇటువంటి ఒక ప్రాజెక్ట్ రాబోతుండడం ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ సంబర
పడిపోతున్నారు.

Advertisement