Rashmi: బంపర్ ఆఫ‌ర్.. మెగాస్టార్‌తో స్టెప్పులేయ‌బోతున్న యాంక‌ర్ ర‌ష్మీ

Rashmi: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ర‌ష్మీ. ఈ అమ్మ‌డు ఒక‌వైపు టీవీ షోలు చేస్తూ అడ‌పాద‌డపా సినిమాలు చేస్తూ ఉంది. కెరీర్‌ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ జబర్ధస్త్‌ షో ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ నేమ్‌, ఫేమ్‌ని సంపాదించుకుంది ఈ అమ్మడు.

golden chance for rashmi
golden chance for rashmi

చేతికందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నటి రష్మి. యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ తాజాగా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సినిమాలో రష్మి ఆడిపాడనున్నారట.

సోదరి సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్‌’ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదేరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘భోళాశంకర్‌’లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే థియేటర్‌ దద్దరిల్లిపోతుందని చిత్రబృందం భావించిందట.

ఈమేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోందట. అంతా ఓకే అయితే.. ఆ పాటలో చిరుతో కలిసి రష్మి స్టెప్పులేయనున్నారని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ వరించినట్లే. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్‌ సాంగ్‌లో రష్మికి అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు.

golden chance for rashmi2
golden chance for rashmi2

మరో వైపు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనున్నారు. అలాగే ఆయనకు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు.