Godfather : లేటుగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సాంగ్ ప్రోమో.! లేటెస్టుగా లేదేం.!

NQ Staff - September 13, 2022 / 07:11 PM IST

Godfather : లేటుగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సాంగ్ ప్రోమో.! లేటెస్టుగా లేదేం.!

Godfather  : ‘థార్ మార్.. థక్కర్ మార్..’ అంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ సినిమా నుంచి ప్రోమో సాంగ్ తీసుకొచ్చేశారు. జస్ట్ కొన్ని సెకెన్ల పాటు మాత్రమే ఈ సాంగ్ ప్రోమో వుంది. అందులో వీడియో ఫుటేజ్ కూడా చాలా చాలా తక్కువే.

‘ఎప్పుడ.? ఎప్పుడ.?’ అంటూ తెగ ఎదురు చూసేశారు మెగాస్టార్ అభిమానులు అలాగే సల్మాన్ ఖాన్ అభిమానులు. ఆలస్యం చేసీ చేసీ.. చివరికి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో సాంగ్ ప్రోమో వదిలారు.!

అదిరిందా.? లేదా.?

Godfather Song Promo

Godfather Song Promo

మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్సులకే కేరాఫ్ అడ్రస్. సల్మాన్ ఖాన్ సంగతి సరే సరి. ఈ ఇద్దరూ కలిస్తే డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోతుందంతే. చిరంజీవికి వయసుతో సంబంధం లేదు డాన్సుల విషయంలో. సో, ఆయన్నుంచి మంచి డాన్సుల్ని ఆశించొచ్చు.

అయితే, సాంగ్ ప్రోమో మాత్రం నిరాశపర్చిందని చెప్పక తప్పదు. అందులో ఒక్క స్టెప్ కూడా పొందుపర్చలేదు. అదొక్కటీ పెద్ద నిరాశ. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని ‘గాడ్ ఫాదర్’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం విదితమే. నయనతార ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ‘హనుమాన్ జంక్షన్’ ఫేం మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us